
DEVATHA DHYANAMALIKA
by KANDUKURI VENKATA SATYABRAHMACHARYA
₹150
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
ఈ గ్రంథం గురించి.... “న చ రూపం వినా ధ్యాతుం కేనాపి శక్యతే" దేవుణ్ణి నిరాకారంగా ధ్యానించడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? అంటున్నాయి మన స్మృతులు. సగుణోపాసన నిర్గుణోపాసనకు ఒక ఆలంబన. మన సంప్రదాయంలో పరమాత్మను చేరుకునే క్రమంలో ఈ రెండూ అత్యున్నతమైనవే. అందుకే దైవాన్ని సాకారంగా, సగుణంగా స్మరిస్తారు. మన పురాణాల్లో దేవతా రూపాలను గురించిన వర్ణనలున్నాయి. వారి గుణాలకు చెందిన విశేషాలున్నాయి. వాటిని ముందుగా అర్థం చేసుకుని, అటుపై దైవాన్ని ధ్యానం చేయాలి. అలాంటి ధ్యానం చేసేవారందరికీ ఉపయోగపడే పుస్తకం ఇది. మైసూరు సంస్థానాధీశులైన శ్రీ మూడవ కృష్ణరాజ వడయార్ సంకలనం చేసి, ప్రచురించినదే 'దేవతా ధ్యానమాలిక. ఈ పుస్తకంలో... అనేక తంత్ర, ఆగమ,పురాణ, శిల్పశాస్త్ర గ్రంథాలను పరిశీలించి 236 శ్లోకాలలో చాముండికాదేవి మొదలు మన్మథుని వరకు 60 మంది శాక్త, శైవ, వైష్ణవ దేవతా ధ్యానశ్లోకాలు, స్తుతులు తాత్పర్యసహితంగా ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ పఠిస్తే భుక్తి ముక్తి కలుగుతాయని ఉత్తరపీఠికలో చెప్పారు. శిల్పకళాభారతి నుంచి ఇంతవరకూ ముప్పై గ్రంథాలు పైగా ముద్రించబడ్డాయి. శిల్ప, ఆగమశాస్త్రాలనే సముద్రాన్ని మథించి 'శ్రీతత్త్వనిధి' అమృతభాండాన్ని శిల్పాచార్యులకు, ఆగమీకులకు, ఆస్తికులకు అందించిన మైసూరు మహారాజా శ్రీ మూడవ కృష్ణరాజ ప్రభువుల సాహిత్యసేవ అజరామరమైనది. కొండ అద్దమందు అన్న రీతిలో వారు రచించి ప్రచురించిన ఈ దేవతా ధ్యానమాలిక గ్రంథాన్ని శ్రీ కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య సంపాదకత్వంలో శ్రీ నేతి శ్రీరామచంద్రమూర్తిగారు అనువదించారు. శిల్పకళాభారతి ప్రచురించింది.