
DEVUDA DEVUDA
₹15
In stock · 152 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
దేవుడు షేవ్ చేసుకోడా? ఆదివారం ఆంధ్రజ్యోతి, 2 నవంబరు 2003న సండే కామెంట్లో దేవుడు షేవ్ చేసుకోడా? అన్ని శీర్షికతో, ఢిల్లీలో జరిగిన 'ఇఫి'లో ప్రదర్శించబడిన 'గాడ్ ఈజ్ ఎ బ్రెజీలియన్' చిత్రం గురించి ప్రచురితమైంది. విశ్రాంతి కోసం భూమికి వచ్చిన బ్రెజిల్ దేవుడి గురించి రచయిత పరిచయం చేశాడు. కర్ . “నువ్వేం చేశావు దేవుడూ?" అంటూ నానా అగచాట్లు పడుతున్న ఒక యువకుడు దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. అసలు ఏదైనా నేను ఎందుకు చేయాలి? సృష్టించాను చాలదా? హాయిగా గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చు కదా. అన్నిటికీ నామీదే ఆధారపడతారేమిటి మీ మానవులు! “దేవుడా! నన్ను చల్లగా చూడు”, దేవుడా! నాకు లాటరీ వచ్చేటట్టు చూడు,” “దేవుడా, ఇది చెయ్యి... అది చెయ్యి... ఏమిటిది?" ఆఖరికి నాకు సంబంధం లేని విషయాల్లో కూడా “ఓ మైగాడ్" అని మాటిమాటికీ అంటుంటారు. మీ పనులు చేయడమేనా నా పని? నేను షేవ్ చేసుకునేది ఎప్పుడిక?" అని కోప్పడ్డాడు దేవుడు. ఒక నాటకం రాయడానికి ఈ మాత్రం ప్రేరణ చాలనిపించింది! అయితే రాసే అవకాశం మరో మూడేళ్లకు గాని రాలేదు. “గాడ్ ఈజ్ ఎ బ్రెజీలియన్" చిత్రం కోసం ప్రయత్నించి, గుంటూరు కళాపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ వల్లూరి తాండవకృష్ణ ద్వారా అమెరికానుంచి తెప్పించుకొనే సరికి “దేవుడా! దేవుడా!" నాటిక పూర్తవనే అయింది. ఇంతవరకూ ఆ చిత్రం చూడనేలేదు. ఆ కాన్సెప్ట్ గురించి సాహిత్యమిత్రులతో చెప్పినప్పుడు అందరూ గొప్పగా స్పందించారు. నాటకం రాస్తే బాగుంటుందని సూచన చేశారు. సెంటిమెంట్ పండించటానికి, కన్నీళ్లు కురిపించడానికి సౌలభ్యం లేని ఇతివృత్తం. మెదడుకు మేత లాంటిది! “సెంటిమెంట్లు పిండాలి. బహుమతులు దండుకోవాలి." అన్నది నాటక దర్శకుల ఫార్ములా. ఇటీవలి తెలుగునాటకం కేవలం మధ్య తరగతి ప్రేక్షకులకు పరిమితమై పోయింది. వాళ్ల భావావేశాలకు తగ్గట్టు రాస్తేనే అది మంచి నాటకంగా చెలామణవుతోంది. "ఆహా ఓహో” అంటూ ఆదరించబడుతోంది. కనకవర్షం కురిపించడానికి సినిమాకు 'మాస్' ప్రేక్షకులు కిడి రాలందిన బ్లెండి. క్స్ హైదరాబాద్