
DHANIKA
₹350
In stock · 18 available
PublisherASLESHAH EDALA
LanguageTelugu
ISBN9789394728851
డిజిటల్ మహిళ Pvt. Ltd. మరియు మిత్రవాక్ సంస్థల స్థాపకురాలు. ఆమె ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, రచయిత్రి, మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ కోచ్, మహిళలకు ఆర్థిక స్వేచ్చ మరియు డిజిటల్ నైపుణ్యాల మధ్య గ్యాప్ను తగ్గించి, వారి జీవితాలను మార్చడంలో ఆమె చేస్తున్న కృషి ఎంతో విశేషం. ఆమె రూపొందించిన కార్యక్రమాలు చాలా మంది మహిళలకు మళ్లీ కెరియర్ ప్రారంభించే అవకాశం ఇచ్చి ఆర్ధికంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి, మరియు "స్క్రీన్ టు సక్సెస్" అనే కొత్త దారిని చూపించాయి. ఉమెన్ ఎంపవర్మెంట్లో పిహెచ్. డి పూర్తి చేసి, జాన్ గ్రైండర్ వద్ద గ్లోబల్ NLP లో శిక్షణ పొందారు. బెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా, బెస్ట్ కోచ్ గా వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల ద్వారా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు వందలాది ట్రైనింగ్ ప్రోగ్రామ్లు నిర్వహించి, ఆరు రీసెర్చ్ పబ్లికేషన్స్ చేశారు. ఆమె కలం ఆశ్లేషభరితం ద్వారా బాల్యశోభ 1&2 పుస్తకాలు పిల్లల యొక్క మానసిక ఎదుగుదల విభాగం లో మంచి గుర్తింపు పొందాయి. ఆమె ప్రారంభించిన డిజిటల్ మహిళ కమ్యూనిటి - శక్తి, సంపద, స్వేచ్ఛ అనే నినాదం తో ఉద్యమంలా మారింది. ఈరోజు తెలుగు మహిళలు ఉన్న ప్రతి గడపకి ఆత్మ బంధువుగా మరియు ఒక శక్తివంతమైన ఎంపవర్మెంట్ ప్లాట్ఫారమ్ గా ఎదుగుతుంది. ఇప్పటికే 25,000 కు పైగా సభ్యులు, 50కు పైగా స్థానిక వ్యాపార సంఘాలు, మరియు ఆడపిల్లల బంగారు భవిషత్తు కోసం Future Stars Program నిర్వహిస్తున్నారు. ఆమె మిషన్ చాలా స్పష్టమైనది. ఒక లక్ష మంది మహిళలు తమ నైపుణ్యాలను ఇంటి నుండే శక్తిగా మార్చుకొని డిజిటల్ ప్రపంచం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనేదే ఆమె మహా సంకల్పం. ప్రతీ ఇంటికో డిజిటల్ మహిళ.. ప్రతీ డిజిటల్ మహిళ ఒక ధనిక..! ధనిక ఇంటి నుండే ఆర్థిక స్వేచ్ఛ J.V. Publications, Hyderabad.