DHARMAPURI by DR.GUJJU CHENNAREDDY Telugu book cover

DHARMAPURI

by DR.GUJJU CHENNAREDDY

₹300
In stock · 357 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126528
DHARMAPURI (O Satyanveshi Jeevana Yatra) by Prof. Gujju Chenna Reddy మనిషికి ఆస్తి, అంతస్తులే గౌరవాన్ని తెచ్చిపెట్టవు. పరువుకోసం ప్రాణాలు అర్పించేవారు లేకపోలేదు. అటువంటివారు ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తారు. నిజజీవితంలో కూడా అక్కడక్కడా కనిపిస్తారు. విజయనగర రాజకుటుంబ వారసుడైన రఘురామరాజు స్వగ్రామం విజయనగర పట్టణ సమీప గ్రామం ధర్మపురి. మహారాజా కళాశాలలో బి.ఏ. చదివిన ఆయన తన రాజధర్మానికి ఏమాత్రం లోటు లేకుండా కరువు కాటకాలలో గ్రామస్తులను ఆదుకుంటాడు. కుటుంబసభ్యులే పరువు తీశారని అర్ధరాత్రి గ్రామం విడిచి తల్లిదండ్రులను, భార్యా, ఇద్దరు బిడ్డలను అండమాన్ పంపించి, సత్యాన్వేషణలో భాగంగా కాశీకి పాదయాత్ర చేశాడు. గంగానది తీరంలో అతను చేసిన ధ్యానం, గ్రంథాలయంలో చేసిన పఠనం ఆయనను జ్ఞానానందను చేశాయి. జీవిత చరమాంకంలో ఉన్న జ్ఞానానందను ఒక సంఘటన ఆయనలో మమతను ప్రేరేపించింది. మూడున్నర దశాబ్దాల తరువాత ఒక స్వామీజీగా ధర్మపురి చేరుకున్న అతనిని ఎవరూ గుర్తుపట్టలేదు. పోర్ట్ బ్లెయర్లో జీవన విధానం, ఎన్నోఏళ్ళ తరువాత రఘురామరాజు భార్య జానకి, పిల్లలు, కోడళ్ళు ధర్మపురి చేరుకోవడం... ఇలాంటి మనుషుల మధ్య విరబూసిన మమతానురాగాలకు అక్షరరూపమే ఈ “ధర్మపురి” నవల. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ గ్రూప్వన్ ఉద్యోగాన్ని కాదని ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ఆచార్యునిగా సేవలందిస్తున్న గుజ్జు చెన్నారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి రెండు పిహెచ్. డిలు అందుకున్నారు. 220 పరిశోధనా వ్యాసాలు రాసిన ఆయన గైడెన్స్లో 45 మంది పరిశోధక విద్యార్థులు డాక్టరేట్లు సాధించారు. హైస్కూల్, డిగ్రీ విద్యార్థులకు టెక్స్ట్బుక్స్ రాశారు. తెలుగు దినపత్రికలకు కాలమిస్ట్, ఆలిండియా రేడియో, దూరదర్శన్లకు ఉపన్యాసకునిగా సేవలందిస్తున్న వీరి మొదటిపుస్తకం “సిక్కోలు కథలు”. మొదటి నవల “మరో మహాత్మ”. రెండవ నవల "లండన్ టు అమరావతి”, మూడవ నవల "స్వప్నసాగరం" నాలుగవ నవల “వివేక మందిరం". కాగా ఐదవ నవల ఈ “ధర్మపురి.” విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-48126-52-8