DHYANAM LOTHULLO by S.SAMPATH KUMAR Telugu book cover

DHYANAM LOTHULLO

by S.SAMPATH KUMAR

₹30
In stock · 7 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
-ధ్యానం లోతుల్లో ధ్యాన ‘సంపత్' - సంపత్తి ప్రస్తుతం స్పీడు యుగం. వేవంతమైన జీవితం. తీరని కోర్కెలు. అవి తీరడానికి మనసులో వేసుకొనే నిచ్చెనలు. ఉద్వేగ భరిత క్షణాలు. అందని ద్రాక్ష కోసం అరులు చాచే పరిస్థితులు. అందనప్పుడు మానసిక ఆందోళనలు. చిత్త వృత్తిలో నిభురులు. ఇవన్నీ నిత్య సత్యాలు. ఈ స్థితి నుండి లక్ష్యసాధనలో మానసిక ప్రశాంతతో సాగే గమన సూచనయే ఈ ధ్యానం లోతుల్లో పుస్తకం. యోగః చిత్తవృత్తి నిరోధకః యోగా మానవుని యొక్క చిత్తవృత్తి భ్రమలను తొలగించి శాంతిని చేకూర్చే సాధనం. తన తండ్రి వారసత్వ సంపదను పుణికి పుచ్చుకుని, సంస్కారవంతమైన జీవన విధానంలోంచి అనుభవం రంగరించి చలన శీతతో మనముందుంచినారు ఈ గ్రంధాన్ని సంపత్ కుమార్గారు సదా అభినందనీయులు. A Sound mind in Sound body. మానసిక బలమే శారీరక బలము. మానసిక, శారీరక బలం అందజేయడానికి అష్టాంగములలో ఒకటి యోగా. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతూ, సమాధిస్థితి కన్నా క్రిందగల స్థితి “ధ్యానం”. మనసు ఆలోచనా స్రవంతి. ఆలోచనలను సహజంగా ఆగిపోయేటట్లుగా చేసి పంచేంద్రియాలను అధిగమించి ఆరవ ఇంద్రియాన్ని 'క్రియాత్మకం' చేసే గొప్ప శక్తి ధ్యానం. ఇది మనసుకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది.