
DICTATORSHIP OF PROLETARIAT, ENNIKALU COMMUNISTLU
by DR.CHELIKANI RAMARAO MEMORIAL COMMITEE
₹20
In stock · 305 available
PublisherDR.CHELIKANI RAMARAO MEMORIAL COMMITEE
LanguageTelugu
SPEECH ON DICTATORSHIP OF PROLETARIAT etc., by A. GANDHI in Telugu, Published by Dr. Chelikani Rama Rao Memorial Committee 'కార్మిక వర్గ నియంతృత్వం', లేదా 'డిక్టేటర్షిప్ ఆఫ్ ప్రొలిటేరియట్' అని ప్రసిద్ధి చెందిన భావన గురించి కమ్యూనిస్టుల్లో చాలామందికి, అలాగే కమ్యూనిస్టులు కానివారికి చాలా అపోహలున్నాయి. కమ్యూనిస్టుల్లో కొంతమంది సోషలిజంలో నిజంగానే నియంతృత్వం అవసరమనీ, ఉండాలని నమ్ముతున్నారు. మరికొంతమంది ఆ భావనను సమర్థించలేక నానా యాతన పడుతున్నారు. కమ్యూనిస్టు వ్యతిరేకులకు ఇది కోతికి కొబ్బరికాయ దొరికినట్లు దొరికింది. 'డిక్టేటర్షిప్' అనే మాటకు మార్క్స్ కాలంలో ఉన్న అర్థం ముఖ్యంగా 20వ శతాబ్దంలో మారిపోయిందనీ, నిజానికి ఆ మాటకు 'ఆధిపత్యం' అని అర్థం చెప్పుకోవాలని చారిత్రక ఆధారాలతో అద్భుతంగా నిరూపించారు ఎ. గాంధీ గారు. వర్గ పోరాటంలో భాగంగా ఉండవలసిన ఎన్నికల ఎత్తుగడలు నేడు ఎలా పరిణమించాయో అందరికీ తెలిసిందే! మరో వ్యాసంలో గాంధీగారు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్లు ఎన్నికల పట్ల ఎలాంటి సూత్రబద్ధ వైఖరి అవలంబించారో వివరంగా తెలిపారు. ఈ వివరాలు తెలుసుకుంటే మన కర్తవ్యం బోధపడుతుంది. కమ్యూనిస్టు కార్యకర్తలు, అభిమానులు ఈ రెండు వ్యాసాలను అధ్యయనం చేయాలని కోరుతున్నాం. డా॥ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ రామచంద్రపురం - 533 255