DIVISEEMA KAVULU SAHITYA SEVA by DR.GUDISEVA VISHNU PRASAD Telugu book cover

DIVISEEMA KAVULU SAHITYA SEVA

by DR.GUDISEVA VISHNU PRASAD

₹300
In stock · 28 available
PublisherDR.GUDISEVA VISHNU PRASAD
LanguageTelugu
దివిసీమ దివ్యసీమ ముందుమాట డాక్టర్ వేటూరి ఆనందమూర్తి ముఖ్య సలహాదారు, శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం, తి.తి.దే (తిరుపతి), ఠాగోర్ నేషనల్ ఫెలో (తంజావూరు), కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ, న్యూఢిల్లీ. తీరాంధ్రదేశానికి నడిబొడ్డున ఉన్న మన దివిసీమ ఒక చారిత్రక ప్రాధాన్యం గల దివ్యసీమ. అది మన ప్రాచీన "మధ్యయుగీన- ఆధునిక వాఙ్మయ సాంస్కృతిక వైభవానికి పెట్టనికోట. కట్టని జలదుర్గం. సజీవ వేగవాహినియైనమన కృష్ణవెణ్ణానది లాగానే కృష్ణామండల వాఙ్మయ పరిణామ వికాస వాహిని కూడా నిరంతర గమనంతో ఆధ్యాత్మిక అభ్యుదయ పథంవైపు ముందుకి దూకుతూ సాగిపోతూ ఉన్నది. అంతే వేగంతో శ్రీగుడిసేవ విష్ణుప్రసాదుగారి పరిశోధన ప్రవాహమూ వెల్లువలై పరుగులువారుతున్నది. ఎన్నెన్నో ఆకరాల సేకరణకై బహుకాలపరిశ్రమగా సాగినవారి యీ సాహిత్యకృషి ఫలప్రదమై పదమూడు అధ్యాయాలలో తమ దివిసీమ పరిచయాన్నీ, ఆస్వాదించిన సాహితీ వైభవాన్నీ సాక్షాత్కరింపజేస్తున్నది. సహృదయులచేత చదివిస్తున్నది. అందమైనశైలితో, ఆకర్షణీయమైన సమాచారంతో, వివరణాత్మకములైన పట్టికలతో చదివేవారికి వికీపీడియా చదువుతున్న స్ఫూర్తిని కలిగిస్తున్నది. అయితే ముందుగా ఏర్పరచుకున్న ప్రణాళిక అచ్చుకూర్పులో పరిష్కరించుకునే అవకాశం లేమిచే కాబోలును అక్కడక్కడా కొంత పునరుక్తిదోషం తప్ప లేదు. మంచి విషయాలు పునరుక్తా లైనా ఆట్టే ఇబ్బందిలేదు. ఇట్టి అభిప్రాయాల కేమి గానీ వీరి కృషి ఇంతకు పూర్వం శ్రీ దివి నరసింహాచార్యులువారి "కృష్ణా స్రవంతి" రచన కన్నా ఎన్నోరెట్లు పెంపు చేకూర్చుకున్న దనడంలో సందేహంలేదు. అనంతుని మొదలుకొని ఆనందమూర్తిదాకా అందరినీ స్మరిస్తూ, తాము సేకరించ గలిగినంత ఎక్కువ సమాచారాన్ని అందించేయత్నం చేశారు రచయిత. ఇందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈగ్రంథంలో పేర్కొనబడినవారందరూ ప్రఖ్యాతి గాంచినవారే. దివిసీమకే కాక రాష్ట్రానికీ దేశానికీ కూడా ప్రశస్తిని గూర్చినవారే. వేటూరి, వేలూరి, విశ్వ నాథ, మండలి, గొట్టిపాటి, వేదాంతం, శిష్ట్లా, వేమూరి, పువ్వాడ, మొవ్వ, సిద్దాబత్తుల, తాళాబత్తుల, దండిభొట్ల, తురగా, యద్దనపూడి, కొడాలి, పింగళి, పాలపర్తి, జోశ్యుల, చింతలపాటి, గొర్రెపాటి, భమిడిపాటి, పాలంకిపాటి, గుడిసేవ, కాసుల, పూసల, మొవ్వ, కాశీ, కర్రా, యార్లగడ్డ, అయ్యంకి, దీవి, అరిపిరాల, సింహాద్రి, తాతా, చేబ్రోలు, కొవ్వలి, గెడ్డం, చింతా, లంక, పోలవరపు, చోడవరపు, కాటూరి, మోపిదేవి, ఉమ్మిడి, వేమూరి, కామరాజుగడ్డ, సుసర్ల, చెరుకువాడ, అద్దేపల్లి, ముక్తేవి, చిరువోలు, భమిడిపాటి, కోపూడి, కొక్కిలిగడ్డ, అర్జా, కొండవీటి, మారేమండ, నాదెళ్ళ, దేవినేని, కోవెల, కోకిల, వాడ్రేవు, మహంకాళి, పల్లె,వక్కలగడ్డ, అమ్ముల, మెండు, ఉండి, ఘంటసాల, పిశుపాటి, ఈమని, హరి, బుద్దు, చిర్రావూరు, సర్వా, అడుసుమిల్లి, చింతా, అడ్డాడ, మోదుమూడి, తలగడదీవి, కొత్తపల్లి, అయాచితం, శృంగార, కోపల్లె, అయినంపూడి, శ్రీరామ, శేషగిరి, భట్లపెనుమర్తి, ద్రోణావజ్యల, ప్రభల, కోసూరు, వరదా, భాగవతుల, ముట్నూరి, ఏనుగు, వేములపల్లి, కొల్లూరి, బోడి, పునుకొల్లు, కొండపల్లి, తుమ్మల, కోటమర్తి, చల్లా, మొదలైన ఇంటి పేర్లన్నీ పలుపలు రంగాల్లో సుప్రసిద్ధాలే.