
DIVYA QUR AN
by TELUGU ISLAMIC PUBLICATION TRUST
₹375
In stock · 2 available
PublisherTELUGU ISLAMIC PUBLICATION TRUST
LanguageTelugu
మనవి మౌలానా సయ్యిద్ అబుల్ ఆలా మౌదూది పేరు నేడు ప్రపంచమంతటా ఇస్లామ్, ఇస్లామీయ సాహిత్యం, ఇస్లామీయ సంస్కరణోద్యమంతో ప్రగాఢంగా పెనవేసుకుపోయింది. ఆయన చేసిన దివ్య ఖుర్ఆన్ ఉర్దూ అనువాదం, సవివరమయిన వ్యాఖ్యానం "తఫీముల్ ఖుర్ఆన్", ఇస్లామీయ ప్రపంచ ప్రజలందరిచేత మన్ననలందుకుంది. ఆ అనువాదం సరళ మయినది, సులభగ్రాహ్యమయింది, ఆధునిక వైజ్ఞానిక యుగపు మనిషికి సుబోధకమయింది. ఆయన శైలి మనోహర్, మనోజ్ఞమయినది, పాఠకుణ్ణి ఇట్టే ఆకట్టుకుని తనతోటే సరికొత్త ప్రపంచాలలో విహరింపజేసేది. మొత్తం తఫీముల్ ఖుర్ఆన్ని ఇప్పట్లో తెలుగు ప్రజలకు అందజెయ్యడం వీలుపడదన్నది వాస్తవం. అది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న, మరెంతో సమయంకోరే బృహత్తర కార్యం. అందువల్ల కనీసం, మౌలానా గారు స్వయంగా తన ఉర్దూ అనువాదంతో పాటు అవసరమనుకున్న చోట క్లుప్తమయిన వివరణలు జతచేసి వెలువరించిన “తర్జుమయే ఖుర్ఆన్”ని తెలుగు ప్రజలకు అందజెయ్యాలన్నది తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ బహుకాల వాంఛ. తదనుగుణంగా ఆ కార్యభారాన్ని ఇస్లామీయ సాహిత్యంతో దగ్గరి సంబంధ మున్న వారు, ధర్మప్రచార కార్యంలో అనవరతం కృషి సలుపుతున్నవారు, శ్రీ షేఖ్ హమీదుల్లా షరీఫ్ గారికి అప్పజెప్పడం జరిగింది. మొత్తం అనువాదాన్ని ఒకేసారి వెలువరించాలని అనుకున్నాము. అన్నీ అనుకున్నట్లే జరగవుగా, అయితే 1981లో వాదియె హుదాలో జరిగిన హిజ్రా శకం 15వ శతాబ్ది ప్రారంభోత్స వాలలో మొదటి 15 భాగాలు, ఫాతిహా సూరా మొదలుకుని బనీ ఇస్రాయీల్ సూరా వరకు, మొదటి సంపుటంగా వెలువరించాము. ఆ తరువాత వీలయినంత త్వరగా రెండవ సంపుటం ప్రచురించి దివ్య ఖుర్ఆన్ పూర్తి అనువాదాన్ని అందజెయ్యాలని అనుకున్నాము. అనివార్య కారణాల వల్ల రెండవ సంపుటం అనువాదం, పరిశీలన ఇత్యాది దశల్లో అనుకోని విధంగా జాప్యం జరగనారంభించింది. ఆ మధ్యన మొదటి సంపుటం మరో ముద్రణ ప్రచురించవలసి వచ్చింది. రెండవ సంపుటం అనువాదాన్ని పునఃపరిశీలిస్తున్నప్పుడు మొదటి సంపుటం అను వాదాన్ని కూడా అనేక కోణాలలో సంస్కరించవలసి ఉంటుందన్న వాస్తవం వెల్లడయింది.