DOCTOR IN LOVE by DR.RAMOJU SRIDHARA RAO Telugu book cover

DOCTOR IN LOVE

by DR.RAMOJU SRIDHARA RAO

₹200
In stock · 56 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400705
వైద్యవృత్తి’ ఎంతగొప్పదో ‘అంతరంగం’ తరహాలో చెప్పిన నవలిక. అనారోగ్య వ్యక్తుల అంతరాళ వేదనలను డాక్టర్లతో ఆత్మీయతపూర్వకంగా, మానవత్వపు మమకారాలతో ఎదుర్కొనే నిజమైన వైద్యులే భగవంతుడితో సమానమని చాటుతుంది. రోగాలే శత్రువులు తప్పించి రోగులు కాదని చెబుతూ, రోగాలను అణచి సంక్షేమం అందించడమే... డాక్టర్ చదువు చదివి గెలిచినవారి సేవా చదువు. డాక్టర్లకు ఒకే ఒక్క ధర్మం ‘మనుషులు’ అన్నది కేంద్రబిందువుగా నిలిచిన అద్భుతం. కులం, మతం, వర్గం అనే భేదాలు వైద్య సేవకు అడ్డుకావని ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది. రోగాలపై పోరాడి మనిషిని బ్రతికించే డాక్టర్ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచే మనసును ఈ నవలలో చూడవచ్చు. గిరిజనుల జీవిత సమస్యలను కళ్లకు కట్టినట్టు, ఎయిడ్స్ వంటి అత్యంత ప్రమాదకర వ్యాధుల పట్ల సమాజానికి అవసరమైన అవగాహన కల్పించే దిశగా రచయిత ఈ నవలను తీర్చిదిద్దారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనిషి అనారోగ్యానికి గురైతే, అతని మనసును ప్రథమంగా అర్థం చేసుకునే వ్యక్తి డాక్టర్. అలాంటి డాక్టర్ల సేవలకు ఈ నవల ఒక గొప్ప హృదయస్పర్శి ట్రిబ్యూట్... ఇక చదవండి....