
DOCTORS CHEERS
by DR.DAVULURI SRIKRISHNA MOHANA RAO
₹80
In stock · 184 available
PublisherDR.DAVULURI SRI KRISHNA MOHANARAO
LanguageTelugu
దేవులూరి శ్రీకృష్ణమోహనరావు డా. విశ్వనాధానికి హైద్రాబాద్లో ఆ శనివారం పని పడితే చిన్ననాటి స్నేహితుడు గవర్నమెంటు సర్వీసులో ఉన్న మందేశ్వరరావింటికి గౌతమి ఎక్సుప్రెస్లో వచ్చాడు. డా. విశ్వనాధం కాలకృత్యాలు తీర్చుకొని బయటకెళ్ళినోడు రాత్రి పదకొండు బటటలకు తిరిగి స్నేహితుడింటికి వచ్చాడు. అప్పటికే మందేశ్వరరావు నిద్రలో ఉన్నాడు. మర్నాడుదయం బ్రేక్ ఫాస్టు తర్వాత, స్నేహితులిద్దరూ తమ చిన్ననాటి ముచ్చట్లు జీవితంలోని కష్టసుఖాల గురించి సావకాశంగా మాట్లాడుకొన్నారు, ముందు డ్రాయింగ్లూమ్లో కూర్చొని. పది కావొస్తుంది. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. బయట వానజల్లు కురుస్తోంది. ఇప్పుడే వస్తానంటూ లోపలికెళ్ళిన మందేశ్వరరావు అడుగున కొద్దిగా ఉన్న ఫారిన్ లిక్కర్, మంచి బ్రాండ్ సీసా, షోడా, వేయించిన జీడిపప్పులతో తిరిగి వచ్చాడు. "ఇదేంటి, మధ్యాహ్నం యీ హడావుడి" అన్నాడు విశ్వనాధం. "రాత్రివేళ నీవు గౌతమీకెళ్ళిపోతావుగా 13 "అయితే మాత్రం, యిప్పుడేంటి యిది" అభ్యంతరం చెప్పేడు డాక్టరు. "కోరి వచ్చిన స్త్రీని, కోరి యిచ్చిన మందుని కాదనకూడదంట" "కొత్త సామెతలు కూడ కనిపెట్టు" అంటూ నవ్వేడు విశ్వనాధం. "అబ్బే యిందులో ఎంతో లేదు. చెరో పెగ్గు" అంటూ మందేశ్వరరావు సీసా వంచి చెరో గ్లాసులో మందు పోసి షోడా కలిపాడు సీసా ఖాళీ అయిపోయింది.