DOLLAR KODALU-90 by SUDHAMURTHY Telugu book cover

DOLLAR KODALU-90

by SUDHAMURTHY

₹90
Currently out of stock
PublisherALAKANANDA PRACHURANALU
LanguageTelugu
డాలర్ కోడలు సుధామూర్తి సంపాదనా అవకాశాలను, భోగవిలాసాలకు, కన్నకలను సాకారం చేసుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సృష్టించే దేశంగా ప్రపంచంలో అన్ని దేశాలలోని తెలివి తేటలు ఉన్నవారిని ఆకర్షిస్తొంది అమెరికా. అయితే డాలర్ల సంపాదన కోసం కన్నవారికి, కావలిసిన వారికి దూరంగా అమెరికాలో ఉంటూ అష్టకష్టాలుపడే వారు కూడా కోకొల్లలు. వారి సమస్యలు వారికున్నాయి. అయితే ఈ సంపాదనావ్యామోహంలో పడి, ఇటు స్వదేశంలో వారినీ వారి సమస్యలను సానుభూతిగా అర్థం చేసుకోకుండా చులకన చూసే వారు కూడా మనకు తరచు తటస్థ పడుతూనే ఉంటారు. అలాగే విదేశాలలో ఉన్నవారిని వారి సంపాదనే గొప్పదిగా భావించి, ఇతర కుటుంబ సభ్యులను, చుట్టు ప్రక్కల వారిని విస్మరించి లేనిపోని గొప్పలకుపోతున్న ఎంతోమంది మనసమాజంలో రోజూ చూస్తునే ఉంటాము. మధ్య తరగతి కుటుంబాలలోని మానవ సంబంధాలను ‘డాలర్' ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో 'సుధామూర్తి’గారు ఎంతో హృద్యంగా తెలియచెప్పే నవల ఇది. 1950లో ఉత్తర కర్ణాటకలో జన్మించిన సుధామూర్తి కంప్యూటర్ సైన్స్లో ఎమ్.టెక్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తున్నారు. ఆమె 'ఇన్ఫోసిస్ ఫౌండేషన్' చైర్పర్సన్ ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె ఇప్పటికే తొమ్మిది నవలలు, నాలుగు సాంకేతిక గ్రంథాలు, మూడు యాత్రా విశేషాల పుస్తకాలు, ఒక కథా సంపుటి, మూడు నిత్య జీవిత అనుభవ కథా సంపుటాలు రచించారు. ఆ అలకనంద ప్రచురణలు (అశోక్ బుక్ సెంటర్ అనుబంధ సంస్థ) 59-6-15, మేరిస్ స్టెల్లా కాలేజ్ ఎదుట విజయవాడ 520 008 ISB No.: 978-81-8294-025-3