
DOSITA CHINUKULU
₹150
In stock · 7 available
PublisherSAHITHI PRACHURANALU
LanguageTelugu
నేను చాలా ఎత్తు నుండి జీవితాన్ని చూశాను కానీ నిజంగా ఆ ఎత్తు నాది కాదు. జాతరలో నాన్న భుజమెక్కి కూర్చున్న చిన్న కుర్రాడికి దేవుడు దర్శనం త్వరగా లభిస్తుంది. నేను కూడా కొంతమంది భుజాలెక్కి జీవితాన్ని చూశాను. సాహిత్యం, థియేటర్, సినిమా, పలు భాషలు నా జీవితంలో తోటి ప్రయాణీకులైన స్నేహితులు, స్నేహితురాళ్లు, అనుబంధాలు ఇలా పెద్ద జాబితానే ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ముగియని ఈ ప్రయాణపు సుదీర్ఘమైన బాటలోని కొన్ని జ్ఞాపకాలని మీ ముందుంచాను. నాకు చదివే సుఖం గురించి తెలుసు. రాసే ఆనందం గురించి వినడమే తప్ప అది ఇంత తీవ్రంగా ఉంటుందని, అలసట కలిగిస్తుందని రాసేవరకు తెలియదు. అనుభవించినదాన్ని అక్షరాల ద్వారా మరోసారి అనుభూతిలా ఆస్వాదించే సంతోషం అనిర్వచనీయం.... ఇప్పుడు మిసిమి ద్వారా మీకు చేరువ కావాలని ఆశిస్తూ... - ప్రకాష్ రాజ్ తెలుగులో తమ మొదటి రచన దోసిట చినుకులు పబ్లిష్ చేస్తున్న ప్రకాష్ రాజ్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన నటుడు, దర్శకుడు, థియేటర్ ఆర్టిస్ట్, నిర్మాత. కన్నడ, తెలుగు, మళయాళం, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల చిత్రాల్లో నటించారు. ఐదు జాతీయ పురస్కారాలు, పలు భాషల్లో ముప్ఫయికి పైగా రాష్ట్రీయ అవార్డులు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. ఈ మధ్యనే ప్రతిష్టాత్మకమైన 'శివరామ్ కారంత్' అవార్డు పొందారు. నటనతోపాటు వ్యవసాయం, సామాజిక సేవ, ఆధ్యాత్మిక చింతన, విద్య, గ్రామీణ భారత నిర్మాణాలలో పాలుపంచుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కర్ణాటకలో 'సేవ్ టైగర్' అభియానికి రాయబారిలా ఉన్నారు. పర్యావరణం, సమాజ శాస్త్రం వీరికి ఇష్టమైన రంగాలు. యువతతో మంచి సాన్నిహిత్యం పెంచుకున్న ప్రకాష్ రాజ్ తమ ఆలోచనా స్రవంతితో సమాజంలో రచన ద్వారా మార్పు కోసం కార్యోన్ముఖులైనారు. ఈ మధ్యకాలంలో ఆయన ప్రారంభించిన 'జస్ట్ ఆస్కింగ్' అభియాన్ దేశంలో అత్యంత ప్రజాభిమానం పొందింది. అద్భుతమైన వక్త అయిన ప్రకాష్ రాజ్ ఎన్నో వేదికలపై తమ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. దోసిట చినుకులు ప్రచురణకు వెళ్లే సమయంలో వారి రెండవ పుస్తకం కూడా ఆవిష్కరింపబడింది..... -మిసిమి