
DR.DASARADHI RANGACHARYA RACHANALU - 9 RANABHERI
₹140
In stock · 242 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'రణభేరి' కావ్యసంకలనం ఆవిష్కరణ హైదరాబాద్, నవంబర్ 17 (పి.టి.ఐ): హిమాలయ సరిహద్దులపై చైనా దురాక్రమణ జరిపిన సమయంలో మాతృదేశం కొరకు ప్రాణాలొడ్డి శత్రువులతో పోరాడిన భారత వీరులకు అంకితమిచ్చిన సమర గీతాల సంకలన గ్రంథం రణభేరికి రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి ఆవిష్కరణ జరిపారు. రణరంగంలో అమరత్వమందిన భారత వీరులకు కృతి ఇచ్చిన రణభేరి గ్రంథాన్ని భారతవీరుల తరుఫున స్వీకరించడానికి ఏరియా కమాండర్ బ్రిగేడియర్ జి. యం. సయీద్ ఆమోదాన్ని తెలిపారు. గ్రంథ సంకలనకర్త శ్రీ దాశరథి రంగాచార్య 'రణభేరి' గ్రంథ ప్రతి బ్రిగేడియర్ సయీద్కు అందచేశారు. రాష్ట్ర పరిశ్రమలమంత్రి డాక్టర్ ఎం. ఎస్. లక్ష్మీనర్సయ్య ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి ఈ సందర్భంలో ప్రసంగిస్తూ, సమర గీతాల సంకలన కార్యక్రమాన్ని నిర్వహించిన యువకవి శ్రీ దాశరథి రంగాచార్యులును, ఈ గ్రంథాన్ని ప్రచురించిన ప్రచురణ కర్తలను అభినందించారు. క్లిష్ట పరిస్థితులలో దేశ ప్రజలు తమ ప్రతిభా విశేషాలను బహిర్గతం చేశారన్నారు. దేశంలో స్వాతంత్ర్యోద్యమాలు సాగిన కాలంలో రచించిన గీతాలు ఈనాటకీ పాత అనుభూతులను గుర్తుకు తెస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారాయన. బ్రిగేడియర్ సయీద్ తమ ప్రసంగంలో, సాయుధ దళాలకు కృతి ఇచ్చిన ఈ గ్రంథం వారిపట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలను అనవతరం గుర్తు చేస్తుంటుందన్నారు. యుద్ధరంగంలో పనిచేసే సైనికులకు తమకు సర్వదా దేశ ప్రజల అండదండలు సర్వదా వెన్నంటి ఉన్నాయన్న అభిప్రాయం వారికి ఏర్పడటానికి ఈ సన్నివేశం దోహదం చేస్తుందన్నారు. రాష్ట్ర కార్మికమంత్రి శ్రీ బి. వి. గురుమూర్తి మాట్లాడుతూ, రక్షణ కృషి నిర్విఘ్నంగా కొనసాగవలసిన అవసరమెంతైనా ఉన్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.