
DR.T.SRIRANGA SWAMY JEEVITHAM SAHITYAM
₹120
In stock · 12 available
PublisherDR.V.VEERACHARI
LanguageTelugu
| డా॥ టి. శ్రీరంగస్వామి జీవితం-సాహిత్యం లక్షణం - లక్ష్యం “స్నేహం నీడనిచ్చే చెట్టులాంటిది" అన్న నానుడిని వ్యాపకంగా చేసుకొని మూడు దశాబ్దాలకు పైగా పలుసాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, పుస్తకాలను ప్రచురిస్తూ నిరంతరం కృషి చేస్తున్న సాహితీ కృషీవలుడు డా॥ టి. శ్రీరంగస్వామి. 1977లో శ్రీలేఖ సాహితీ సంస్థను స్థాపించి పుస్తకావిష్కరణ సభలు, అష్టావధాన సప్తాహాలు, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనాలు, జాతీయస్థాయి సదస్సులు నిర్వహించారు. వ్యక్తికి బహువచన రూపం శక్తి అని నిరూపించారు. అది వరంగల్లు పట్టణానికి గర్వకారణం. రాష్ట్ర, రాష్టేతర, ప్రాంతాలలోని అనేక మంది సాహితీవేత్తలతో వీరికి సాహితీ సాన్నిహిత్యం ఉంది. "వేసిన దారి వెంట వెళ్ళడం సులభం, కొత్తదారులు వెతకడం కష్టం" అంటారు శ్రీశ్రీ. కష్టమైనా, వినూత్న ఆలోచనలు, ప్రయోగాలతో విభిన్న సాహిత్య కార్యక్రమాలను ఇష్టపూర్వకంగా నిర్వహించడం డా॥ టి. శ్రీరంగస్వామికే చెల్లింది. వీరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా అంగబలంగానీ, అర్థబలంగానీ ఏవీ ఉండవు. సంకల్పబలం మాత్రం ఉంటుంది. ఒక సంకల్పబలం-ఒక విశ్వాసం; వెరసి శ్రీరంగస్వామి సాహిత్య జీవిత ప్రస్థానం. డా॥ టి. శ్రీరంగస్వామిగారు సాహిత్యాన్ని ప్రవృత్తిగా ఎంచుకొని కవిగా, రచయితగా, విమర్శకుడిగా, పరిశోధకునిగా విస్తరించారు. శ్రీలేఖ సాహితి ద్వారా వర్ధమాన సాహితీపరులు మొదలుకొని ఉద్ధండుల వరకు అందరిని కలుపుకొని, పరస్పర సహకార పద్ధతిలో కష్ట నిష్టూరాలకు ఓర్చి అనేక కవితా, కథా సంకలనాలను వెలుగులోకి తెచ్చారు. అందుకే డా॥ టి. శ్రీరంగస్వామి ఉద్యోగ విరమణ సందర్భాన్ని పురస్కరించుకొని వీరి సాహిత్య కృషిని ఒకసారి నెమరు వేసుకొని, ఈతరం వారికి స్ఫూర్తిని, ఉత్తేజాన్ని అందించాలన్న లక్ష్యంతో "డా॥ టి. శ్రీరంగస్వామి జీవితం- సాహిత్యం" పై రాష్ట్రస్థాయి సమాలోచన సదస్సును ఏర్పాటు చేశాం.