DUTY by AADIREDDY MAVULLU Telugu book cover

DUTY

by AADIREDDY MAVULLU

₹220
In stock · 219 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400118
DUTY (Novel) by Adireddy Mavullu బెస్లో హాయిగా కూర్చుని చేసే ప్రయాణం వెనుక ఎన్ని వెతలు ఎంత మంది అవస్థలుంటాయో తెలియజెప్పాలన్న తపనే ఈ నవల ఆవిర్భావానికి మూలకారణం. కాలంతో పోటీపడి బస్లో పనిచేసే కండక్టర్, డ్రైవర్లను కొత్తకోణంలో చూపించాలన్న ఆసక్తితో 영영란. "బస్లు సమయానికి రావు... వచ్చినా ఆగవు.... ఆగినా జనాన్ని ఎక్కించుకోవు... కండక్టర్కి చిరాకెక్కువ... చిల్లరివ్వడు... డ్రైవర్ బస్సాపడు... బడాయి ఎక్కువ...” ఇత్యాది విసుర్లూ విమర్శలూ అందరితో పాటు నేనూ ఒకప్పుడు చేసినవాడినే. అయితే నేను బస్ కండక్టర్ని అయ్యేక ఆ అభిప్రాయం మారిపోయింది. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలంటే జీవితాలను పణంగా పెట్టి సుఖసంతోషాలను త్యజించి మరమనుషులలా కాయకష్టం చేయడం అని అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. నా అనుభవాలకు ఆలోచనలకు అక్షరరూపమే ఈ “డ్యూటీ” నవల. నాలా ఉద్యోగం చేసి ఆ బాధల్ని అర్థం చేసుకునే అవకాశం రాని వారిని ఎడ్యుకేట్ చెయ్యాలన్న దుగ్ధతో రాశాను. సిబ్బంది ఒత్తిడిని అర్థం చేసుకుని కడివెడు కన్నీళ్ళు కార్చి జాలి కురిపించకపోయినా వాస్తవ పరిస్థితుల్ని అవగతం చేసుకుని కండక్టర్, డ్రైవర్లకు సహకరిస్తారన్న ఆ(అత్యా)శతో రాశాను. రచయిత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISB No. 978-93-91400-11-8