DYSTOPIA by SRISUDHA MODHUGU Telugu book cover

DYSTOPIA

by SRISUDHA MODHUGU

₹150
In stock · 3 available
PublisherSRISUDHA MODHUGU
LanguageTelugu
అట్రిబ్యూట్ ఇలా ఏదో జరుగుతుందని చాలా రోజుల ముందే అర్ధమైంది. మోసమని ఒకరు ఆరోపిస్తే, ఇంకొకరు వాడుకోబడ్డాను మోసం న్యాయమే అన్నారు. మోసం చేయడం న్యాయం ఎలా అయిందని ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజాయితీ, వినయ విధేయతలు పెట్టుబడి పెట్టాక దానికి తగ్గ రాబడి లేనప్పుడు వెళ్ళిపోవడం మోసం కాదంటుంది నస్రీన్. ఇప్పుడు నా భవిష్యత్తు రత్నం చేతుల్లో ఉంది. నా భవిష్యత్తు మాత్రమేనా? తెలివి, మాటకారితనం, కొంచెం స్వార్థం ఉన్న మనిషి రత్నమని అందరికీ సులభంగానే తెలిసిపోయేది. ఎప్పుడూ అతి మేకప్. ఎర్రటి లిప్ స్టిక్ పెదాల కంటే కొంచెం మందంగా, దట్టంగా పెట్టేది. కళ్ళకి కాటుకతోపాటు కళ్లపై అనేక రంగులు వేసేది. తన చామనచాయ రంగు కనిపించకుండా తెల్లగా కనబడాలనే తాపత్రయంతో రకరకాల క్రీములతో ముఖంపై కోటింగ్ వేసుకొనేది. చామనచాయ అందమైన రంగని చెప్పాలనిపించేది. ఎత్తయిన ఎద ఇంకా ఎత్తుగా కనిపించడానికి