
EASY WAY TO LEARN ENGLISH LANGUAGE
₹50
In stock · 5 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట ఈ రోజుల్లో English భాషకు ఉన్న ప్రాముఖ్యత గూర్చి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మనం మనదైనందిన జీవితంలో ఎంతో మందితో సంభాషిస్తూ ఉంటాము. అన్ని సందర్భాలలో మనకు ఆంగ్లభాష అవసరం కనబడుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ public school లో ఇంగ్లీష్ బాగా వస్తుందో చూసి మరీ చేర్పిస్తున్నారు. ఈ భాషకు అంత ప్రాముఖ్యత వున్నది కనుకనే ఏ entrance exam లోనైనా, ఉద్యోగాలకు వెళ్ళినపుడు ఇంటర్వ్యూ.. చేసినా ఎక్కువగా English పరిజ్ఞానం అవసరం అవుతున్నది. exams 55grammar Items 2 2 an-swer చేయలేకపోవడం ఎంతో చిన్న విషయాలను సైతం తప్పుగా జవాబు వ్రాయడం నా ఈ 15 సంవత్సరాల ఆంగ్లబోధనలో గమనిస్తూనే ఉన్నాను. గృహిణులు తమ పిల్లలకు వారి schoolలో ఇచ్చిన homework లో doubts ను తీర్చలేకపడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అన్ని వర్గాల వారిని దృష్టిలో వుంచుకొని అటు సామాన్య ప్రజలకు, ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు, అన్ని వర్గాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకం వ్రాయాలని యోచించి, grammar అంటేనే భయం అనే వారిని సైతం, ఎంతో ఈజిగా నేర్చుకునే విధంగా ఒక self learning material ను అందించడానికి చేసిన నా ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని భావిస్తూ... మీ అమూల్యమైన సలహాలను అందించినచో తదుపరి పుస్తకంలో తదనుగుణంగా రచన సాగించే అవకాశం ఉంటుందని మనవి చేస్తూ, నా ఈ ప్రయత్నాన్ని అన్ని విధాలుగా ప్రోత్సాహించిన నా తల్లిదండ్రులకు, ప్రముఖ విద్యావేత్తలు శ్రీ వేముల వెంగళరావు, డా॥ రామలింగేశ్వరరావు గార్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దావులూరి శ్రీనివాసరావు