
EDAVAKU BIDDA
by MALUPU BOOKS
₹150
In stock · 1 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076121
edavaku bidda... ఇది కన్నీటి కథ. కత్తుల కథ. వలసపాలనలో దుర్భరమైన దోపిడీ పీడనలు అనుభవించిన తూర్పు ఆఫ్రికాలో కెన్యాలోని గికుయు జాతి కార్చిన కన్నీటి ప్రవాహాల కథ. వలస పాలనలో మగ్గుతున్న ఒక వెనుకబడిన సమాజంలో చదువే ఒక విముక్తి మార్గమని నమ్మిన తల్లీ కొడుకుల కథ. చదువు కాక ఇతర విముక్తి మార్గాలు కూడ ఉన్నాయని అన్వేషించిన కుటుంబ సభ్యుల కథ. దుర్మార్గమైన ఆ వలస పాలనను కూలదోయడానికి, స్వయంపాలన సాధించడానికి ప్రయత్నించిన గికుయు వీరయోధుల మౌమౌ సాయుధ తిరుగుబాటు కథ. భిన్న ధ్రువాలలో జీవిస్తున్న యువతీయువకుల అనురాగపు కథ. ఎన్నో విషాదాల కథ. మరెన్నో విజయాల కథ. అద్భుతమైన, అనన్యసాధ్యమైన జీవన చిత్రణ కథ. ఒక నవలగా దానికదిగానే ఆకట్టుకునే పుస్తకం కావడం మాత్రమే దీని ఘనత కాదు. ఇది ఒక సంక్లిష్ట సామాజిక చరిత్రకు దర్పణం. ఇది రచయిత ఆత్మకథాత్మక నవల. ఇది రచయిత రాజకీయ మేధో పరిణామాన్ని సూచించే కళాత్మక దస్తావేజు. - ఎన్. వేణుగోపాల్