
EDI PAAPAM
₹100
In stock · 1 available
PublisherSRI MAHALAKSHMI BOOK CORPORATION
LanguageTelugu
ఏదిపాపం? చివుకుల పురుషోత్తం ఆనాడు ఏదిపాపం? నవలతో ఒక కొత్త రచయిత అవతరించాడు. ఏ బిరుదులు, భుజకీర్తులు లేకుండా హఠాత్తుగా అవతరించిన ఈ రచయిత తన మొదటి నవలాప్రయత్నంలో పాఠకుల మనసుల్ని జయించి తనకంటూ ఓ సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. తన తొలినవలతోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొంది సాహితీ శిఖరాన్ని అధిష్టించివున్న సుప్రసిద్ధ రచయితల జాబితాలో చేరిపోయాడు. ఆయనే శ్రీ చివుకుల పురుషోత్తం ఆ నవలే ఏదిపాపం? వర్తమాన సాంఘిక సామాజిక సమస్యలను వ్యాఖ్యానిస్తూ జీవిత విలువల్ని అద్దం పట్టి చూపి, పాఠకుల 'ట్రెండ్' లోకి తను వెళ్లకుండా తన 'ట్రెండ్' లోకే పాఠకుల్ని రప్పించుకున్న నవల ఏదిపాపం? ఆధ్యాత్మిక చింతన కొరవడి పాత విలువలు లుప్తమై కొత్త విలువలు ఏర్పడని సంధికాలానికో 'షాక్ థెరపి' ఏదిపాపం? ఆస్తిక నాస్తిక వివాదములతో అనంతమైన భావాలతో లౌకిక, పారమార్థిక చింతనలతో పాఠకుల మనసుల్ని ఊపి, కుదిపి, కర్తవ్యోన్ముఖుల్ని చేసిన నవల ఏదిపాపం? జీవితం అంతదుర్భరమో చెబుతూ, అదే జీవితంలో స్వశక్తి మీద మనిషి రాకెట్లా ఎంతపైకి లేవగలడో భౌతికంగా, ఆధ్యాత్మికంగా నిరూపించిన నవల ఏదిపాపం? 'ఏదిపాపం?' నవలను గురిచి చెబుతూపోతే మరో నవలే అవుతుందన్న మా అభిప్రాయానికి మీరూ రాక తప్పదని ఘంటాపథంగా చెప్పగలం! శ్రీ మహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్