
EDUREETA
₹100
In stock · 53 available
PublisherDR.ARIPIRALA NARAYANARAO
LanguageTelugu
యోచన సంఘసంస్కర్త వీరేశలింగంగారి గురించి అనేక వ్యాస సంపుటులు వచ్చాయి. సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా వీరేశలింగంగారి దృక్పథముగాని, ఆచరణ సిద్ధాంతాలుగాని నేటి మానవునికి స్పృహలోకి కూడ రావడం లేదనేది సత్యం. ఏటికెదురీది అనేక రంగాలలో సంస్కరణలు చేసిన మాన్యుడు మరొకడు లేడనేది నా యోచన. సంస్కరణలో, సంస్కృతిలో, సాహిత్యంలో, భాషలో అనేక మార్పులు తీసుకువచ్చారాయన. వాటన్నిటినీ ప్రక్కకుబెట్టి సంపాదించిన ఆస్తులే కాదు, తాతలనాటి ఆస్తులనుకూడ సమార్పణం కావించిన విశాల దృక్పథం గల మహనీయుడు. బ్రతికుండగనే తాము ఏర్పరిచిన సంస్థలలో కనీసం సభ్యత్వంకూడ నిలుపుకోని త్యాగశీలి. అంతేకాదు తన ఏర్పరిచిన ట్రస్ట్నుండి డబ్బు అప్పుగా తీసుకోలేని దుస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. కోటానుకోట్లు అక్రమార్జనలను చేస్తున్న నేటి బడా బాబులకు వీరేశలింగంగారిగురించి కనీస అవగాహనకూడ లేకపోవడం దురదృష్టకరం. తాను ఏర్పరచిన ట్రస్ట్‌లలో అన్ని కులాలవారికి, అన్ని వర్గాలవారికి చోటు కల్పించారు. నేటి సామాజిక సంఘాలలో ప్రస్తుతం పేరుకు మాత్రమే అన్ని వర్గాలువారు సభ్యులు. ఎవరికుంపటి వారిదే. 'మనోడు' అనే పదం ఉంటే వాటు చాల పనులు చక్కబెట్టుకోవచ్చు. అన్ని పనులు సమకూరుతాయి. ఇక - వీరేశలింగంగారి 'ఎదురీత' పుస్తకంగురించి వస్తే మూఢ నమ్మకాలను నిరసించడం, వితంతు వివాహాలు చేయడం, వివేకవర్ధనిలో అంచగొండులు గురించి వ్రాయడం, తెలుగులో నూతన ప్రక్రియలు ప్రారంభించడం - వీటన్నిటినీ కందుకూరి వీరేశలింగం పంతులుగారుచేసారు.