
EE GULABHIKI MULLU LEVU
by RASARAJU
₹280
In stock · 130 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788197696169
EE GULABI KI MULLU LEVU (Katha Samputi) by Rasa Raju ఈ కథలెందుకు చదవాలి? కాలక్షేపానికా! కాదు! మరి... ఇందుకోసం చదవండి. కరిగిపోతున్న కాలంలో ఒరిగిపోకుండా మనిషి 'మనీషి'గా నిలబడటానికి ఈ కథలు చదవాలి. స్నేహానికీ శీలముంటుంది. దానిని నిరూపించే మహర్షులూ ఉన్నారు. వాళ్ళందరూ ముళ్లు లేని గులాబీలే!... సంస్కృతికీ, సంప్రదాయానికీ, అభిరుచులికీ, అభిమానానికీ, తెలుగువాడే ఇంధనం. ఆ చైతన్యం విదేశీయుల గుండెగంటల్ని కూడా మోగిస్తుంది. సాయానికి సాయంసంధ్య లేదు. ఆ వెలుగెప్పుడూ ఏదోరకంగా దారి చూపిస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నానికి సెలవు లేదు. ఆలోచిస్తే మంచికి మనిషే కేంద్రబిందువు. అన్ని వేళలూ అమృతతుల్యాలే! మలచుకోవటంలోనూ, వలచుకోవటంలోనూ మాధుర్యముంటుంది. కాలాన్ని కౌగిలించుకోవటంలోనే నేర్పు చూపించాలి. సరసంలో సైతం ముద్దు ముద్దుగా దేశభక్తిని చాటుకోవచ్చు. మాంగల్యంలోంచి 'మనీ'ని చూసే మగాళ్లు లేకపోలేదు. పాతివ్రత్యంలో సావిత్రులైనా ఎదురు తిరిగి బుద్ధిచెప్పే మగువలున్నారు. తల్లిని మించిన దైవం లేదు-ఆ భావం ముందు గురిపెట్టిన సూరీడు చేతిలో తుపాకీ అయినా గుట్టుచప్పుడు కాకుండా గులాబీలా ఒదిగిపోవలసిందే! పనిలోనే పరమాత్ముణ్ణి దర్శించే తులసిమొక్కలాంటి పారిశుద్ధ్య కార్మికులుంటారు. వాళ్ళకు రెండు చేతులెత్తి నమస్కరించాలి. శిఖరాలు కూడా నడుస్తాయా? “ఆశిఖరాలు" మాత్రం నడుస్తాయి - ఆశయానికీ, ఆదర్శానికీ ఆనవాళ్లుగా... ఇలా మరెన్నో అంశాలు ఈ కథాసంపుటిలో ముళ్లులేని గులాబీలై మిమ్మల్ని హత్తుకొంటాయి. పుస్తకాన్నిచేతిలోకి తీసికోండి! ప్రయాణించండి...! విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-81-976961-6-9