
EE NAGARAM JABILLI
₹100
In stock · 1 available
PublisherG.SAATYAKI
LanguageTelugu
మన కథకులు "ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవ దృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకు, అభిమానులకూ ఆయన శేషేన్, శేషేంద్ర అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు శేషేంద్ర శర్మ......." ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక యువ నుంచి యువ దాకా (కవితా సంకలనం) నుంచి పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలుకా నాగరాజుపాడు భారత ప్రభుత్వ 'రాష్ట్రందు' బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.. గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి 'లా' డిగ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. నా దేశం-నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్ ప్రధాన రచనలు.