
EKAGRATHA - 40
₹40
In stock · 721 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పనిదొంగ రాజయ్య మోతుబరి రైతు. అతని దగ్గర ఎప్పుడూ పదిమంది దాకా జీతగాళ్ళు పని చేస్తుండేవాళ్ళు. వాళ్ళంతా ఎంతో కాలంగా నమ్మకంగా పని చేస్తున్నారు. వాళ్ళల్లో ఒకతను ముసలి వాడవటం వలన పని మానుకుని స్వగ్రామంలో కొడుకు దగ్గరకు వెళ్ళిపోయాడు. అతని స్థానంలో చిన్నయ్యను క్రొత్తగా పనిలోకి తీసుకుకొన్నాడు రాజయ్య, చిన్నయ్యకు పనంటే బద్ధకం. కబుర్లతో కాలక్షేపం చేస్తూ పని నిర్లక్ష్యం చేసేవాడు. చిన్నయ్య ధోరణి మిగతా వాళ్ళకు నచ్చలేదు. "చిన్నయ్యా! యజమాని మనకు అడిగినంత జీతం ఇస్తున్నప్పుడు పని కూడా సక్రమంగా చెయ్యాలి. నీ వలన పని వెనక బడుతోంది. ఇలాగైతే నీ మీద ఫిర్యాదు చేస్తాను" అంటూ పాపన్న అనే మరో జీతగాడు హెచ్చరించాడు.