
EKAKI NOUKA CHAPPUDU
₹300
In stock · 6 available
PublisherPRIYADARSHINI PRACHURANALU
LanguageTelugu
Ekaki Nouka Chappudu ఇందులో పేర్లు మారొచ్చు, పదాలు మారొచ్చు, భాష మారొచ్చు, ప్రాంతం మారొచ్చు, అనుభవాలు రూపాంతరం చెందొచ్చు కాని... మానవ మనుగడలో... ఏ దశలో అయినా కొంచెం అటుఇటుగా అవే అనుభవాలు తారసపడతాయి. ఎందుకంటే అది జీవితం. అదే జీవితం. ఏ సిద్ధాంతమైనా మనిషిని పురోభివృద్ధి దిశగా నడిపించగలదు. కానీ నిలబెట్టేది 'విలువ'లు మాత్రమే!! చివరికి 'సిద్ధాంతాన్ని' కూడా... !!! అలాంటి విలువల్ని పుష్కళంగా నిలిపి ఉంచడంలో ప్రధానపాత్ర సమాజానిదే... చిత్రం ఏమిటంటే ఆరోగ్యవంతమైన విలువలతో నింపి సమాజ పరిసరాల్ని పదిలపరచాల్సింది, కొనసాగించాల్సింది మాత్రం తిరిగి వ్యక్తులే!!! 'అణచివేత' ‘దొపిడీ' అనేవి ప్రత్యేకంగా 'దళితులు' గా పిలవబడుతున్న వారికి మాత్రమే చెందినవి కావు. అవి నలుపు తెలుపులంటూ రంగుల్లో మెరవచ్చు, మతం అనే ఉన్మాదంలో దాగొచ్చు, జండర్ అవతారం దాల్చొచ్చు, మందబలంలో దూకొచ్చు, ప్రాంతాల కుతంత్రంలో మొలవచ్చు... చివరికి అంది వచ్చిన అవకాశం... అందుకోలేనివాడిపై ప్రయోగం కావచ్చు. ఏది ఏమైనా భిన్న సందర్భాలలో భిన్న అనుభవాలతో కలిగిన మరిన్ని స్పందనల అక్షరరూపమే దేవపుత్రగారి కథలు. అందుకే కాబోలు దేవపుత్రగారి కథలు అనుభూతి ప్రధానంగా కంటే అనుభవ ప్రధానంగా సాగుతాయి. అనుభవంలో సంతోషం కంటే ఎక్కువగా గుర్తుండేది, వెంటాడేది కూడా దుఃఖము, బాధలే!! సహజసిద్ధంగా తనచుట్టూ ఉన్న పరిసరాలలో రోజువారి కార్యక్రమాల్లో నుండి నొప్పిని మాత్రమే గమనించగలగడం, వేగంగా స్వీకరించగలగడం, లోతుగా స్పందించగలగడం అనే లక్షణమే తన అనుభవాలకు కథారూపం దాల్చే విధంగా పొందిన ప్రేరణఫలితమే ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు' కథా సంగ్రహం. సమయంతో కానీ, సమకాలీనతతో కానీ పనిలేకుండా బతుకుటద్దమై... దేనికదిగాను, మొత్తం కలిపి ఒకటిగాను ... బతుకు అర్థం చెప్పే... అనుభవాలన్నీ మనిషికి మరచిపోలేనివి మాత్రమే కాదు, మరచిపోకూడనివి కూడా అని చెప్పేవే దేవపుత్రగారి కథలు. సీమ భాషలో... అనంతపురం మాండలీకంలో... ప్రత్యేకించి తనదైన యాసలో... అణగారిన వర్గాల స్వరాలని... కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ... 'మిణుగు' కావడమే కాక, సీమ భావితరాలకు ఒక 'పద్మనాభుని నిధి'లా మిగులుతూ... కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ 'ఏకాకి నౌక చప్పుడు', 'ఆరు గ్లాసులు’ కథా సంగ్రహం సీమకే గర్వకారణం.