
EKALAVYA PRABANDHAM
by DR.AMMALADINNE VENKATARAMANA PRASAD
₹40
In stock · 16 available
PublisherDR.AMMALADINNE VENKATARAMANA PRASAD
LanguageTelugu
ఏకలవ్య నేపథ్యం ఇది ఈ కావ్యకథాసంగ్రహం కాదు. ఏకలవ్యుడు నిర్వీర్యుడైన వికలాంగుడు కాదు. తనకుతాను అంగవైకల్యాన్ని అధిగమించిన కృషీవలుడు. మహావీరుడుగా అజేయపరాక్రమవంతుడుగా, సంస్కృ తాంధ్రభారత హరివంశాల్లో ఏలా దర్శనమిస్తాడో సోదాహరణంగా వివరించే సాధికార కథనం ఇది. నా కావ్యలతా వికాసానికి : దోహదక్రియ. ఆంధ్రమహాభారతం ఆదిపర్వం పంచమాశ్వాసంలో 231 వ వచనం నుండి 245వ పద్యం వరకు ఏకలవ్యుని కథ చెప్పబడింది. ఈ కథ ఇంచుమించు సంస్కృత ఆంధ్ర భారతాలు రెండింటిలోను సమానమే. తరువాత ఇంకెక్కడా కవిత్రయ భారతంలో ఏకలవ్య ప్రసక్తి రాదు. కాని ద్రోణపర్వంలో ఏకలవ్యుని మరణాన్ని సందర్భానుసారంగా శ్రీకృష్ణుడే పేర్కొంటాడు. శ్రీమదాంధ్ర మహాభారతం ద్రోణపర్వం పంచమాశ్వాసంలో 239వ వచనంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఘటోత్కచుడు మరణించి నందుకు నేనెందుకు సంతసించానో చెబుతానని ఆ కారణాన్ని అర్జునునికి వివరిస్తూ "ఇదే విధంగా ఓ అర్జునా! నీ కొఱకు ఏకలవ్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనవారిని ఒక్కొక్కడిని ఒక్కొక్కవిధంగా హతమార్చాను. ఒకవేళ వారందరూ ఈ సమయంలో జీవించి యున్నట్లయితే దుర్యోధనుడు వారినందరిని సహాయంగా తెచ్చుకొనే వాడు. ఆ ఏకలవ్యాదులు ముగ్గురూకూడి యుద్ధంచేస్తే వారిని ఎవ్వరూ ఎదిరించలేరు" అని అంటాడు. అంతే! ఆ తరువాత ఇంక ఎక్కడా ఆంధ్రభారతంలో ఏకలవ్య ప్రసక్తి రాదు.