
EKKADIVI TELLA KAKULU
₹150
In stock · 3 available
PublisherDR.TUMMALA RAMAKRISHNA
LanguageTelugu
ఎక్కడివీ తెల్లకాకులు? ఇప్పుడే ఎందుకు? ఓ చల్లని సాయంకాలం వేళ క్యాంటీన్లో వేడి వేడిగా కాఫీ తాగుతున్నప్పుడు ఒక మిత్రుడొచ్చి "మిత్రమా ! తుమ్మల సార్ రాసిన 'తెల్లకాకులు' కథ చదివాను. ఏమీ అర్ధం కాలేదు. అసలా కథలో ఏముంది? కథలు ఎందుకు రాస్తారు? ఎవరికోసం రాస్తారు?" అని అంతే వేడిగా వాడిగా ప్రశ్నించాడు? నేను కూడా 'తెల్లకాకులు' కథను గురించి ఆలోచించినప్పుడల్లా నా మనుసును తొలిచే ప్రశ్న ఇది. దానికో కారణముంది. తుమ్మల రామకృష్ణగారు ఆ కథను రాయడానికి మొదలు పెట్టిన కాట్నించి, పుస్తకం ముద్రించి దాన్ని సాహితీ మిత్రులకి పంపించడం వరకూ అన్నీ నేను దగ్గరుండి కళ్ళారా చూశాను. ఎన్ని సార్లు రాసి కొట్టేసేవారో. తనకు నచ్చినట్లు వాక్యం వచ్చేంత వరకూ రాస్తూనే ఉండేవారు. తిరగరాసే బాధ్యత నాకప్పగించేవారు. సహృదయులు, విమర్శకులు స్పందించి రాసిన వాటిని భద్రపరిచేవారు. వీటన్నింటినీ చూశాక ఏదో ఒకటి చేయాలనిపించింది. దానిలో భాగమే ఈ ప్రయత్నం. మనిషి ఒక ఆరని మంట. మండీ మండీ ఏదో ఒక రోజు చల్లగైపోతాడు. మనిషి ఒక నీటి ఊట. పారి పారి ఏదో ఒక రోజు ఇంకిపోతాడు. మనిషి ఒక గట్టిబండ. తనలోని జడత్వం పోయి ఏదో ఒక రోజు పగలకుండా ఉండలేడు. మనిషి ఒక మంచుకొండ. కరిగి కరిగి తప్పక ప్రవహించి తీరుతాడు. మనిషొక జ్ఞాపకాలమూట. చెప్పి చెప్పి ఏదో ఒక రోజు అన్నీ మర్చిపోతాడు. మనిషాక అనుభవాల బాట నడిచి నడిచి ఎక్కడో ఒక చోట ఆగిపోతాడు. ఆ ఆగినచోటే అసలు కథ మొదలౌతుంది. ఆ ఆగినచోటే మనిషి తనలో అంతర్లీనంగా దాగి ఉండే తన ప్రపంచాన్ని మన ముందుంచి మిమ్మల్ని మీరు చూసుకోండని మనల్నొక అలజడికీ, ఆవేశానికీ, ఉద్వేగానికీ, ఉల్లాసానికీ గురిచేస్తాడు. ఈ విషయాలన్నీ 'తెల్లకాకులు' కథలో రామకృష్ణగారు మన కళ్ళముందుంచారు. ఆచార్య తుమ్మల రామకృష్ణగారు విస్తృత జీవితానుభవాలు గల వ్యక్తి. ఆధునిక భావాలను తనలో తొందరగా ఇముడ్చుకునేవ్యక్తి. సంగీత సాహిత్య ప్రియులు. సున్నిత హృదయులు. వృత్తిరీత్యా ఆచార్యులు.