
ELLORALO VALLU MUGGURU
by SRIPATHI PANDITARADHYULA PARVATEESAM
₹90
In stock · 7 available
PublisherSRIPATHI PANDITARADHYULA PARVATEESAM
LanguageTelugu
నామాట 'ఎల్లోరాలో వాళ్ళు ముగ్గురు' కథలన్నీ కథారచన అభ్యాసం రోజుల్లో అచ్చయిన తొలికథలు, 'మంచుపల్లకి'లో కథలు కూడా ఆరోజుల్లో రాసిన కథలే. నా కథారచనకు ప్రేరణ మాకు 11వ తరగతి (1955)లో ఆంగ్లవాచకంలోని Where love is there God is ໑ తోలొస్తాయి (Leo Tolstoy) మా ప్రధాననోపాధ్యాయులు శ్రీ యడవిల్లి సూర్య నారాయణమూర్తిగారి బోధన మహాత్యం అని ఇప్పుడనిపిస్తున్నది. ఆ ఏడాది వేసవిలో, పరీక్షలయిన తర్వాత, నా తొలికథ రాశాను. 'అన్నాచెల్లెలు' అది అముద్రితం. అలభ్యం. అచ్చయిన నా తొలికథ 'సహృదయ', 1956 నవంబర్లో 'ప్రజామత' వారపత్రికలో వచ్చింది. అప్పుడా పత్రిక బెంగుళూరు నుండి వెలువడేది. రెండో కథ 'పర్వదినం' అదే పత్రికలో '57లో వచ్చింది. మూడోకథ ఆంధ్రప్రభ వారపత్రికలో 58లో అచ్చయింది. ఆ కథ పేరు 'పరివేష్టిత'. అన్నీ 'శ్రీపతి' కలం పేరుతోనే అచ్చయ్యాయి. ఆ రోజుల్లో విశాఖపట్నం మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాల విద్యార్థి జీవితం సాహిత్యపఠనానికి తలుపులు తెరిచింది. చేతికి అందిన ప్రతి పుస్తకం, ప్రతి పత్రిక చదువుకోవటమే జీవితమైపోయింది. తొలిరోజుల్లో నేను చదివిన సాహిత్యం అంతా శరత్, రవీంద్రనాధ్ టాగోర్, మునీ ప్రేంచంద్. ఆరోజుల్లో బెంగాలీ, హిందీభాషల నుండి అనువాదాలు విరివిగా వచ్చేవి. చాలామంది మోస్తరుగా నేను కూడా శరత్ తెలుగువాడే అన్నంత ప్రేమతో చదివాను. 'మహాప్రస్థానం' యోగ్యతాపత్రంతో చలం పరిచయం... ఆ వాక్యం, ఆ భాష, ఆ నిర్భీతి, ఆ తర్క ఔన్నత్యం, ఆ సత్యాన్వేషణ తీవ్రత, ఆ స్వేచ్ఛా భావజాలం ఆనాడు నాకు అర్థమైనాయని కాదు.