
EMITI EKKADIDHI EE THIVRAVADAM
by SOUDAMANI
₹100
In stock · 4 available
PublisherNAVAYUGABHARATHI
LanguageTelugu
బర్బరులు ద్వారాన్ని దాటి లోపలికి దూసుకొస్తున్నారు రాజీవ్ శ్రీనివాసన్ ముంబయి నగరంపై పాకిస్తానీ ఆతంకవాదులు, వారికి సహకారమందించే స్థానికులూ కలిసి చేసిన దాడి కొత్త విషయమేమీ కాదు, గతంలో జరిగిన ఘటనల పునశ్చరణయే. కైబరు కనుమ మీదుగా బర్బరులు అనేక పర్యాయాలు మన దేశంలోకి వచ్చి మన ప్రజానీకంపై విరుచుకపడి మాటలలో చెప్పలేనంత నష్టాన్ని, విధ్వంసాన్ని తెచ్చిపెట్టారు. ఇంతకీ సగటు హిందూ దేశపౌరుడు చేసిన నేరమేమిటో తెలుసా? సంపదను సమకూర్చుకోవటంపట్ల తన దృష్టిని కేంద్రీకరించటం! కాబట్టి ఆ సంపదలను కొల్లగొట్టటమే ప్రధానోద్దేశంగా, బర్బరులు మన దేశంలోకి వచ్చేవారు. స్వతంత్ర భారతం పరిశ్రమలలో, వాణిజ్యంలో కుదురుకొని మళ్ళీ సంపదను వృద్ధి చెందింపజేయటంలో నిమగ్నమవుతోంది కదా, అందుకని, ఆర్థికంగా బలపడకుండా నిరోధించే తలంపుతో బర్బరులు మళ్ళీ భారతదేశంపై దాడులు సాగిస్తున్నారు. ఇప్పటిలాగే, అప్పుడు కూడా ప్రజలను రక్షించటంలో పాలకులు విఫలురైనారు. ఎప్పుడైనా, ఎక్కడైనా - పైకి వ్యక్తంచేసుకున్నా, చేసుకోబడకున్నా పాలకులకూ - ప్రజలకూ మధ్య ఒక సహజమైన ఒప్పందం ఉంటుంది. ప్రజలు పన్నులు చెల్లిస్తూ, చట్టాలనూ, ఇతర నిబంధనలనూ పాటిస్తూ ఉంటే, పాలకులు, తమ ప్రజల భద్రత, స్వేచ్ఛ, సుఖజీవనములకు హామీ ఇస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటారు. భారతదేశ ప్రజానీకానికి ఈ విధమైన భద్రత కల్పించటంలో ఇక్కడి పాలకవర్గం మళ్ళీమళ్ళీ విఫలమవుతూ ఉంది. కైబర్, బోలన్, కనుమలను రక్షించుకోవటంపట్ల శ్రద్ధవహించే కొద్దిపాటి జాగ్రత్త తీసికొంటే చాలు, తమ ప్రజలకు ఏ విధమైన కష్టమూ రాకుండా రక్షించగలిగే వారమన్న జ్ఞానాన్ని వారు చూపించ లేకపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఆనాటి మన నాయకులలోని నాయకత్వ వైఫల్యమే. కనీస జ్ఞానం లోపించటమే, వ్యూహాత్మకమైన జాగ్రత్తలు లేకపోవటమే.