EMOTION - WORLDS FIRST LOVE, WORLDS FIRST FIGHT, WORLDS FIRST FRIENDSHIP by VENU English book cover

EMOTION - WORLDS FIRST LOVE, WORLDS FIRST FIGHT, WORLDS FIRST FRIENDSHIP

by VENU

₹99
In stock · 10 available
PublisherVENU
LanguageEnglish
EMOTION యదార్థ సంఘటన "నేను హైదరాబాద్్కవచ్చిన మొదట్లో ఎక్కడుండాలా ?” అని నాలుగయిదు ఏరియాలను చూసి చివరగా కూకట్పల్లి బెటర్ అని సెలక్ట్ చేసుకున్నాను" కూకట్పల్లిలో ఇంటర్మీడియట్ కార్పోరేట్ కాలేజ్లు చాలా ఉండేవి. ఉదయాన్నే స్టూడెంట్స్ రాకతో కళకళలాడిపోయేది. సాయంత్రం కాలేజ్లు వదలగానే స్టూడెంట్స్ కామెంట్స్ చేసుకుంటూ గొడవలతో బిజీ అవుతూ, అమ్మాయిలను చూస్తూ, కేఫ్ లలో బేకరీలలో జోషి కనిపించేవారు. చూసినవారెవరికయినా లైఫ్ అంతా ఇంటర్లోనే ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఆ ప్రపంచం విలువ స్టూడెంట్స్ ల్లో చాలా తక్కువ మందికి తెలుసు. నాకు ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అర్థమయింది. అప్పట్లో నాది లొకజ్ఞాన్ జూనియర్ కాలేజ్. ప్రస్తుతం నేను శ్రీచైతన్య కాలేజ్లోనే చదువుతున్నా నేను రాయబోయే సంఘటన మాత్రం నా చదువు అర్థంతరంగా ఆగిపోయిన 2008వ సంవత్సరానికి చెందినది. ఇంకో నాలుగు నెలలైతే ఇంటర్ పూర్తవబోతోంది. ఇంటర్మీడియట్ చివరి రోజులను అస్వాదిస్తూ సంతోషంగా బతుకుతున్న రోజులవి. మామూలుగా అబ్బాయిలనొక క్లాస్లో, అమ్మాయిలను ఇంకో క్లాస్లో కూర్చోబెట్టి వేరువేరుగా టీచింగ్ చేసేవారు. అప్పుడప్పుడూ ఎగ్జామ్స్ (Exams) మాత్రం అమ్మాయిలను, అబ్బాయిలని కలిపి ఒకే క్లాస్లో కండక్ట్ చేసేవారు. ఎప్పుడూ IPE Weekends, Unit Test, Eamcet అని వారానికి రెండు పరీక్షలు నిర్వహించేవారు. బహుశా ఎగ్జామ్స్కు క్లాసులను డిసైడ్ చేసేవారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు అమ్మాయిలను, అబ్బాయిలను, అబ్బాయిలను కలిపితే జరిగే నష్టం గురించి అయినా ఇష్యూ ఎగ్జామ్ రాయడం కాబట్టి క్లాస్ ల గురించి ఎవరూ పట్టించుకోరు. కాని ఆ క్లాస్ూమ్ నా జీవితంలో అంటే, ఐ మీన్ గతంలో నేను చనిపోయినపుడు మర్చిపోయిన ఒక ఎమోషన్ని గుర్తుకు చేసింది. నన్ను నేను తెలుసుకునేలా చేసింది.