
ENTHO CHINNADI JEEVITHAM
₹100
In stock · 3 available
PublisherTARIMALA JANAKI
LanguageTelugu
నా మాట నా మొదటి కథలసంపుటి "మూగమనసులు" 1977వ సంవత్సరంలో అరుణా పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. రెండవ పుస్తకం "మనసిది నీ కోసం" 1989లో తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక (పాక్షిక సహాయం) సహాయంతో ప్రచురణ జరిగింది. మూడవది "మరొక తలుపు" 2004లోనూ, నాలుగవ కథాసంపుటి "డాక్టర్ రచయిత” 2007లోనూ ప్రచురింపబడ్డాయి. ఇప్పుడు 2011లో ఐదవ పుస్తకం "ఎంతో చిన్నది జీవితం" రూపుదిద్దుకుంది. 1964లో మొదలైన నా రచనా వ్యాసంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే ఆ భగవంతుడికి మొట్టమొదటగా నా మనస్సుమాంజలి అర్పిస్తున్నాను. పుస్తకాలు చదవడంపట్ల చిన్నతనంనించే ఆసక్తి కలిగించిన అమ్మా నాన్నగార్లకు కృతజ్ఞతా పూర్వక వందనాలు. వివాహానికి ముందు నుంచి కథలు రాయడం మొదలు పెట్టిన నేను వై.జె. అనే పేరుతోనూ, వై. జానకి అనే పేరుతోనూ రాశాను. ఇప్పటివరకూ నేను రాసిన కథల్లో చాలా కథలు నా దగ్గర లేవు. ఆ పాత పత్రికలు ఎక్కడా నాకు లభ్యం కావట్లేదు. ఆ రోజుల్లో జాగ్రత్త చేసుకోలేక పోయినందుకు విచారపడుతున్నానిప్పుడు. కానీ ఏ విషయంలోనూ కూడా గతాన్ని తవ్వుకుని ఫలితం ఉండదు. చేసిన పొరపాటు మళ్ళీ చెయ్యకుండా ఉండడమే ఆ విచారానికి ఊరట కలిగిస్తుంది. భద్రపరుచుకున్న కథలతో నాలుగు సంపుటాలు తీసుకొచ్చాను. ఇప్పుడీ ఐదవ సంపుటం ప్రచురిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మానవ జీవితం మూన్నాళ్ళ ముచ్చటగానే చెప్పుకుంటాం. అందుకే ఎంతో చిన్నది జీవితం... అది అర్థవంతమైతే అంతకంటే ఏం కావాలి! ప్రసిద్ధ రచయిత, విమర్శకుడు అయిన శ్రీ విహారిగారిని ఈ పుస్తకానికి ముందుమాట రాసివ్వమని కోరగానే తమ అంగీకారం తెలియజేయడమే కాక వెంటనే ఇవ్వమని నేను అడిగితే అన్యథా భావించకుండా మంచి మనసుతో రెండవరోజే తమ “ముందుమాట" అందజేయటం వారి సహృదయతకి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.