ERRAMANDARALU by DR.T.NALINI Telugu book cover

ERRAMANDARALU

by DR.T.NALINI

₹100
In stock · 7 available
PublisherPARSPECTIVES PUBLISHARS
LanguageTelugu
erramandaralu 'ఎర్రమందారాలు' నవలా నేపథ్యం 1949 చైనా విముక్తికి ముందుకాలం. రహస్య పార్టీ నిర్మాణం, దాని కార్యకలాపాల గురించి, అత్యుత్తమమైన, మహోన్నతమైన త్యాగాల గురించి ఈ నవల ఎన్నో వాస్తవ చిత్రీకరణలు చేసి చూపింది. తమ సర్వస్వాన్ని పార్టీకి అంకితం చేస్తూ విప్లవ కార్యకర్తలు పొందే ఉద్విగ్న క్షణాలను ఆఖరి శ్వాసను కూడా పోరాట విజయానికే వెచ్చించాలనే వారి విప్లవ స్ఫూర్తినీ మనం మరువలేము. కొత్త విప్లవతరం చిన్న వయసునించే క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవరచు కోవాలనే తపన, బంధాలు, అనుబంధాలు, వాటిని మించిన విప్లవానుబంధాలు, కన్నీళ్ళను అధిగమిస్తూ చేసే శపథాలు, అందరికోసం ఒకరుగా చేసే త్యాగాలు అంతర్లీనంగా ఇందులో సాగుతాయి. శత్రువు బలహీనతలు, భయాలు, క్రూరత్వం, వారి నిర్మాణం, విప్లవ కార్యకర్తల జాగ్రత్తను బలహీనతను చాకచక్యంగా సొమ్ము చేసుకునే వారి చాతుర్యం, చివరికి ప్రజాబలం ముందు వారు నీరుగారిపోవడం కూడా మనం చూస్తాం. అపజయాలను వెన్నంటి వచ్చే విజయాలు, అపజయాన్ని విజయంగా మార్చుకోవడానికి పడే ప్రయాస మనల్ని అబ్బురపరుస్తుంది. కథాగమనం, పాత్రల చిత్రీకరణ, సంఘటనల కూర్పు, భావ వ్యక్తీకరణ, అంతిమ విజయం రూపంలో సారంలో కూడా 'ఎర్రమందారాలు' అత్యుత్తమమైన నవలగా మిగిలి వుంటుంది.