ERRANA JANAJEEVANA CHITRANA by DR.PAPIREDDY NARASIMHAREDDY Telugu book cover

ERRANA JANAJEEVANA CHITRANA

by DR.PAPIREDDY NARASIMHAREDDY

₹150
In stock · 19 available
PublisherDR.PAPIREDDY NARASIMHAREDDY
LanguageTelugu
మామాట ఈ గ్రంథం బెంగుళూరులోని సి.పి. బ్రౌను సేవాసమితి సంస్థాపకులు శ్రీ యిడమకంటి లక్ష్మిరెడ్డి గారి వితరణతో ముద్రించబడింది. శ్రీ లక్ష్మిరెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాళ్ళూరు (ప్రకాశం జిల్లా) వారు. ఇక్కడ చదువు ముగించుకొని బెంగుళూరుకు వ్యాపారం నిమిత్తం వెళ్ళారు. ఈయన సామితీ పిపాసి. సాహితీ సేవ ఆయన కార్యక్రమాల్లో ముఖ్యమైనది. వీరు బెంగుళూరులో తెలుగు భాషా సేవ చేస్తూ అందులో భాగంగా సి.పి. బ్రౌన్ సేవాసమితిని స్థాపించి దాని ద్వారా కర్నాటకలో ముమ్మరంగా తెలుగు భాషాసేవ చేస్తున్నారు. తన జిల్లా వారైన ఎర్రనామాత్యుని సాహితీ సౌరభాలను ప్రజలకందించే ఈ గ్రంథాన్ని పునర్ముద్రించడానికి ఇష్టంతో ఎర్రనను గౌరవించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అభీష్టాన్ని గౌరవించారు. లక్ష్మి రెడ్డి కుటుంబమే దేశానికంకితమైన కుటుంబం. ఈయన తాతగారు కీ.శే. యడమకంతి బ్రహ్మారెడ్డి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. 1941వ సం||లో వ్యష్ఠి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయనను 1941 సం॥లో బ్రిటీష్ ప్రభుత్వం రాజద్రోహం అభియోగంపై కేసుపెట్టి శిక్ష విధింపజేసి మూడు నెలల కాలం బళ్లారిలోని అలాపూర్ జైలులో వుంచారు. 1943వ చెందిన బాంబుల ప్రయోగకారులు, దేశభక్తులైన విప్లవ వీరులకు 45 రోజులపాటు ఆశ్రయమిచ్చి స్వాతంత్ర్యోద్య మానికి తోడ్పడ్డారు. 1939 మరియు 1949లో అప్పటి నెల్లూరి జిల్లా బోర్డుకు సభ్యునిగా రెండు దఫాలు ఎన్నిక కాబడ్డారు. అట్టి కుటుంబంలోని వాడైనందున ఆ విత్తుకు ఋణపడివుండి తీర్చుకోవడానికి ఈ ప్రాంత ప్రముఖులలో ఒకరైన తాతగారు బ్రహ్మారెడ్డి కీర్తి, యశస్సులను గుర్తు చేసుకొంటూ ఈ పుస్తక ప్రచురణ తాతగారి పేర చేస్తూ కొంత ఋణం తీర్చుకొంటున్నాడు. దీనిని ప్రకాశం జిల్లా రచయితల సంఘం ద్వారా సి.పి. బ్రౌన్ సేవా సమితి కార్యక్రమంగానే ప్రకటిస్తున్నారు లక్ష్మారెడ్డి. ఈ పుస్తక ప్రచురణను సూచించిన సహృదయులు “సృజన" సాహితీ సంస్థ-అద్దంకి వారికి ధన్యవాదములు. గ్రంథకర్త నరసింహారెడ్డిగారు, మరియు ప్రకాశం జిల్లా రచయితల సంఘం లక్ష్మిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపు చున్నది. ఈ గ్రంథ ప్రచురణ బెంగుళూరులోని సి.పి. బ్రౌన్ సేవాసమితికి ఓ కలికితురాయి.