ERRANI AKASAM by DR.P.RAMESH NARAYANA Telugu book cover

ERRANI AKASAM

by DR.P.RAMESH NARAYANA

₹200
In stock · 54 available
PublisherDR.P.RAMESH NARAYANA
LanguageTelugu
ఎర్రని ఆకాశం (ప్రాక్పశ్చిమ సాహితీరూపాల్లో వేశ్యాప్రసక్తి) డా|| పి. రమేష్ నారాయణ విశ్రాంత ప్రధానాచార్యులు సాహిత్యవిమర్శలు, సాహిత్యపరిశోధనలో సామాజికశాస్త్రాల వినియోగం గురించి ఇటీవల విలువైన చర్చ జరిగింది. రమేష్నారాయణ గారి ఈ గ్రంథం ఆచర్చకు బలం చేకూర్చింది.....పుస్తకం చదవడం ప్రారంభించినప్పుడు ప్రపంచసాహిత్యంలో ప్రతిబింబించే వేశ్యల జీవితాల్ని అన్వేషించే విమర్శగ్రంథమని అభిప్రాయం కలుగుతుంది. పుస్తకం చివరికి వచ్చేసరికి ఇదొక సామాజికశాస్త్రరూపాన్ని సంతరించుకున్నట్లనిపిస్తుంది. ఇలాంటి అంశాన్ని ఒక సాహిత్యవస్తువుగా ధైర్యంగా స్వీకరించి అన్నికోణాల్లోను స్పృశిస్తూ ఏకసూత్రంగా ఇలాంటి రచనను కొనసాగించడం ఒక సాహసమే. ఈ ప్రయత్నాన్ని రమేష్నారాయణ గారు తమకున్న పరిధుల్లో నిజాయితీగా పూర్తిగావించి సఫలీకృతులయ్యారని నేననుకొంటున్నాను. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి