EVARI PICHI VARIKANANDAM HASYA NATIKA by KONDURI KASIVISWESWARA RAO Telugu book cover

EVARI PICHI VARIKANANDAM HASYA NATIKA

by KONDURI KASIVISWESWARA RAO

₹50
In stock · 9 available
PublisherKONDURI KASIVISWESWARA RAO
LanguageTelugu
హాస్యరస నాటిక ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్గా నోబుల్ బహుమతి అందుకోవాలన్నది సైంటిస్ట్ అమర్నాథ్ ఆశయం. అతనికి మతిమరుపు, కొంచెం చెముడూ వున్నాయి. బజార్లో దొరికే పాత పుస్తకాలు, పత్రికలు కూడా కొనుక్కొని అవి చదువుతూ తన పరిశోధనలు చేస్తున్నాడు. అలాంటప్పుడే పాత కాగితాలు కొనే ప్రకాశ్తో పరిచయం ఏర్పడింది. ఇక నుండీ డబ్బుసంపాదించటానికి ఎండల్లో, వానల్లో వీధులు తిరగక్కరలేదు. నాకు అసిస్టెంట్గా ఉండమని, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ప్రకాశ్క సైంటిస్ట్ అమర్నాథ్. ఆ తరువాత ల్యాబరేటరీలో పరిశోధనలు ప్రారంభించారు. మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తూ, జబ్బులూ గట్రా రాకుండా, ముఖం ముడుతలు పడకుండా వంద సంవత్సరాలూ యవ్వనంలో ఉండటానికి లైఫ్ 100 అనే మెడిసన్ ని తయారుచేశాడు అమర్నాథ్. సైంటిస్ట్ అమర్ నాథ్ చేస్తున్న ప్రయోగాలలో అనేక సమస్యలు, ఇబ్బందులు. మతిమరుపులు కూడా ఉన్నాయి. వాటికి తోడు తికమకపెట్టే ప్రకాశ్ ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ అతని కామెంట్స్లో నిగూఢమైన అర్థమేదో దాగి ఉందనిపిస్తుంది. లైఫ్ 100 మందును కొనుక్కొని తాము కూడా తమ తమ రంగాలలో ఇంకా ఎన్నో ఘన విజయాలు సాధించాలని హార్మోనియం హరిశంకర్, కవికుమార్, క్రికెట్ కిషోర్ మరియూ మిలట్రీ విజయ్లు సైంటిస్ట్ దగ్గరకు వచ్చి మందును త్రాగుతారు. ఆ మందు కాస్తా రివర్స్లో పనిచేయటం ప్రారంభించి నల్గురికీ పిచ్చి పట్టి, ల్యాబ్లోనే వికృత చేష్టలు చేశారు.