
EVARU ELA MATLADATHARU-50
by USHA SRI
₹50
In stock · 9 available
PublisherUSHA SRI
LanguageTelugu
మాటకి ఉన్న శక్తి ఏమిటో, ఎవరితో ఎలా మాట్లాడాలో వాగ్విదాంవరుడయిన హనుమంతుని ద్వారా నేర్చుకునే అవకాశం ప్రసాదించాడు వాల్మీకి మహర్షి. మహర్షి హదయం “ఎవరితో ఎలా మాట్లాడాలి?” రూపంలో శ్రీ ఉషశ్రీ కలం నుండి తెలుగువారికి అందింది, అందుతూనే వుంది. ఎవరు ఎలా మాట్లాడతారో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో, ఎదుటి మనిషి మాటల్లోని అర్థాన్ని, అంతరార్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేటికి కూడా అన్వయించుకోగలిగేలా భారతం ఉద్యోగపర్వంలో అందించారు వ్యాస మహర్షి. మహర్షి అంతరంగాన్ని రేడియో వ్యాసుడు శ్రీ ఉషశ్రీ నేటి తరానికి అరటిపండు ఒలిచి ఇచ్చినట్లుగా అందించినదే ఈ “ఎవరు ఎలా మాట్లాడతారు?" (భారతంలో రాయబారాలు.)