F.M RADIO BASHALO CODE SWECHING by LINGALA MANGAMMA Telugu book cover

F.M RADIO BASHALO CODE SWECHING

by LINGALA MANGAMMA

₹60
In stock · 18 available
PublisherLINGALA MANGAMMA
LanguageTelugu
నా మాటల్లో. కుమారి లింగాల మంగమ్మ, ప్రస్తుతం కేంద్రవిశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిని. ఈ చిరంజీవి నాకు శ్రీయుత జి. భాస్కర్ (అసిస్టెంటు రిజిస్ట్రారు, తెలుగు విశ్వవిద్యాలయం) గారి ద్వారా పరిచయం. నాపై గల గురుభావంతో, తాను, తెలుగు విశ్వవిద్యాలయం భాషాశాస్త్రశాఖకు సమర్పించిన ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసాన్ని ప్రచురింపదలచి, ఆశీస్సులు అందించమనటం, నా యీ ప్రస్తుత ఉద్యోగానికి కారణం. కాగా, ఈ ‘ఎఫ్.ఎం.రేడియో భాషలో కోడ్ స్విచ్చింగ్' సిద్ధాంత వ్యాసాన్ని అనుశీలన చేయటానికి నాకు అర్హతగాని, యోగ్యతగాని వుందని నేను భావింపలేకున్నాను. ఇది కేవలం, అందునా ఇది అత్యున్నత శ్రేణికి చెందిన భాషాశాస్త్ర అవగాహనకు, ఆలోచనా సరళికి చెందిన పరిశోధనాంశం. దీనిని విశ్లేషించి, నిగ్గుదేల్చగల సత్తా నాకు లేదు. కారణం, భాషాశాస్త్రంపై నాకు గల అవగాహనకు గల పరిమితులు. అయితే ఒక్కమాట మాత్రం చెప్పగలను. ఎన్నుకున్న పరిశోధనాంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, నిబద్ధతతో అధ్యయనం చేయాలనే కాంక్ష ఈ పరిశోధక విద్యార్థినిలో పుష్కలంగా ఉంది. ఇదే పరిశోధకులకు,కావలసిన ప్రాథమికమూ, ఆవశ్యకమూ అయిన లక్షణం. ఇవి ఈ విద్యార్థినిలో నిండుగా వున్నాయి. అందుకు మెచ్చుకుంటున్నాను. మరే విషయాన్ని అయినా, అంత దీటుగానూ ఈ విద్యార్థిని పరిశీలింపగలదని నా తీర్మానం. ప్రస్తుత విషయాన్ని, దాని ఫలితాలను, ఉపయోగాన్ని నేను నిర్ధారించలేనని, దానికి నేను అశక్తుడను అని ముందే మనవి చేశానుగదా! ఈ పరిశోధక వ్యాసాన్ని అమూలాగ్రమూ నిశితమైన దృష్టితో చదివాను. ఆపైన నాకు అనిపించిందేమంటే- ఈ నేటి తరంలో భాషా వ్యవహారం ఎన్ని పోకళ్ళు పోతుందో గదా, మరెన్ని విధాలుగా మార్పు చెందనున్నదో గదా అనే భావన నా మనసును సుడి త్రిప్పింది. అయితే ఇదేదో నా భాష సంకరమై పోతుందే అన్న దిగులు మాత్రం నాకు లేదు. భాషా వ్యవహారం కాలంలో అనేక మార్పులకు లో లోనవుతుంది.