FIRST AID-36 by OM PUBLICATIONS Telugu book cover

FIRST AID-36

by OM PUBLICATIONS

₹36
In stock · 4 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
ఫస్ట్ ఎయిడ్ అంటే? ప్రమాదాలు సంభవించినప్పుడు డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళేలోపున చేసే చికిత్సను 'ప్రథమ చికిత్స' అంటారు. మొట్టమొదటిసారిగా ప్రథమ చికిత్సను ఆచరణలోనికి తెచ్చింది 'ఎస్మార్క్' అనే జర్మన్ వైద్యుడు. 1870లో రెడ్ క్రాస్ సంస్థ స్థాపించబడిందన్న సంగతి తెలిసిందే. 1877 లో గాయపడిన వారికి సేవ చేయటానికి సంబంధించి శిక్షణనిచ్చేందుకు ఓ సంస్థను స్థాపించడం జరిగింది. దీనిపేరు 'సెంట్గాన్ అంబ్యులెన్స్ అసోసియేషన్', 1879వ సంవత్సరంలో 'సెంట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్' వారు 'ఫస్ట్ ఎయిడ్' అన్న పదాన్ని వాడుకలోకి తీసుకువచ్చారు. ప్రతి వ్యక్తి 'ఫస్ట్ ఎయిడ్' గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అందువల్లనే ఈ పుస్తకం అత్యవసరమైనదిగా భావించబడుతున్నది. ప్రతి ఇంట్లోనూ ఫస్ట్ఇయిడ్ కిట్ వుండాలి. సరే.... ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏముండాలి? ఈ పుస్తకం మొదటి అధ్యాయం అదే. కాబట్టి చదవండి. అసలు ఫస్ట్ ఎయిడ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మీ పిల్లలు ఆడుకుంటూ పడిపోయి దెబ్బలు తగిలించుకున్నారు. గాయం నుంచి రక్తంకూడా కారుతోంది. మీరేం చేస్తారు? వెంటనే వంటింట్లోకి పరిగెత్తి ఇంత కాఫీ పాడో, టీ పోడో అద్దుతారు. ఇలానే చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళినప్పుడు గాయం మొత్తం శుభ్రంగా క్లీన్ చేయడానికే డాక్టరుకు బోలెడు సమయం పడుతుంది. గాయం లోపలికి కాఫీ పాడి వెళ్ళిపోయి శుభ్రం చేసేటప్పుడు మీ పిల్లలకు నొప్పి కల్గిస్తుంది. ఇలా కాకుండా ఇంటి దగ్గరే మీరు గాయాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంటే బావుండేదికదా! అలాగే... ఎప్పుడైనా వంట చేస్తున్నప్పుడు కాలిందనుకోండి. వెంటనే ఏంచేస్తారు? సిరాలో వేలు ముంచుతారు. అలాగే కాలినచోట సిరా వ్రాస్తారు. ఈ విధంగా చేయడం చాలా పారపాటు. ఇలా చేసినందువలన డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గాయం తీవ్రత ఎంతో తెలుసుకోవడం డాక్టరుకి కష్టం అవుతుంది.