
FIRST TIME
₹30
In stock · 1 available
PublisherKALLURI SAILAJA
LanguageTelugu
ఫస్ట్ టైమ్.... కల్లూరి శైలబాల... ఈ కుతూహలమే వారికి చదువు మీద ఆసక్తి కలిగిస్తుంది. అప్పుడు వారు కష్టపడుతూ కాకుండా ఇష్టంగా చదువుతారు. ఇష్టంగా చేసే పని ఏదైనా సరే ఎవరైనా సరే నూటికి నూరు శాతం నక్సెస్ అవుతారు. కాబట్టి మీ పిల్లల కుతూహలాన్ని వారిలోని జిజ్ఞాసను ప్రోత్సహించండి. మీరు ఆపని చేయాలంటే వారికి మంచి మంచి పుస్తకాలు పరిచయం చేయాలి. పుస్తకాలు చదవడం వలన కలిగే ఆనందం. విజ్ఞానం వారి అనుభవంలోకి రావాలి. పిల్లలకు కుతూహలం ఎక్కువ అని చెప్పుకున్నాం కదా! వారి మనసులో ఎప్పుడు ఏ సందేహం కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఉదా...ఐస్క్రీమ్ తింటూ వస్ట్ ఐస్క్రీమ్ ను ఎవరు తయారుచేశారు? అన్న సందేహం కలగచ్చు. వెంటనే మిమమ్మల్ని దాని గురించి ప్రశ్నించచ్చు. వారి సందేహాలన్నింటికీ మీకు జవాబు తెలిసి ఉండకపోవచ్చు... మీకు తెలీని ప్రశ్నలు మీ పిల్లలు అడిగితే వారి మీద విసుక్కోకండి. తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. మీ పిల్లల జిజ్ఞాసను పెంచండి. వారిని జ్ఞానం పరంగా కూడా ఎదగనివ్వండి. మీ పిల్లలకు ఈ పుస్తకం కానుకగా ఇవ్వండి. ఏమో మీ పిల్లల్లో ఒక న్యూటన్ ఉండచ్చు... ఓ ఐన్స్టీన్ ఉండచ్చు... ఓ అబ్దుల్ కలాం ఉండచ్చు... ఫస్ట్ టైమ్... కల్లూరి శైలబాల...