
FOREIGN CENT
₹40
In stock · 303 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఫారిన్ సెంటు బంధువుల కుర్రాడు సతీష్ అమెరికాలో ఉద్యోగం వచ్చిందంటూ ప్రయాణానికి ముందు వచ్చి అక్షింతలు వేయించుకుని, ఆశీర్వాదం తీసుకుని వెళ్లాడు. ఓ నెలరోజుల వ్యవధిలో అతగాడి తండ్రికి ఫోన్ చేసి సతీష్ యోగక్షేమాలు తెలుసుకున్నాను. అతను వుండే నివాసానికి, పనిచేయవలసిన ఆఫీసుకు దాదాపు అరవై కిలోమీటర్ల దూరమట. అయినా అతి చక్కని రహదార్లు, అత్యంత ఆధునికమైన కారువల్ల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఇరవై నిమిషాలలోపే చేరుకుంటాడట. అదే మనకయితే అరవై కిలోమీటర్ల దూరాన్ని మన గతుకుల రోడ్ల వెంట, అందులోనూ ఎర్ర బస్సెక్కి వెళ్లాలంటే... చెయ్యి ఎత్తితే చాలు ఆపవలసిన బస్సయితే మూడు గంటల్లోనూ, కాకపోతే రెండు గంటల్లోనూ చేరుకోగలమేమో? అదీ మధ్యలో రాస్తారోకోలూ వగైరాలు లేకపోతే. గుడ్డలు విప్పుకోవటంలోను, గంతులు వేయటంలో, గడ్డాలు పెంచుకోవటంలో, జడలు కత్తిరించుకోవడంలో, చేతుల్లేని జాకెట్లు వేసుకోవడంలో మనకి ఇతర దేశాలు ఆదర్శంగానీ, చక్కని రోడ్లు వేసుకోవడంలో, కష్టపడి పనిచేయడంలో, పనిచేసి మాత్రమే, కష్టపడి మాత్రమే డబ్బులు సంపాదించాలనుకోవడంలో మనం ఎవర్నీ ఆదర్శంగా తీసుకోలేం. అసలా విషయాలు మనకి గిట్టవు అలాంటి మాటలు ఎవరైనా చెప్తే శంఖారావమే అయిపోతుంది. తాగి తందనాలు వేయటానికి, అడ్డమైన గడ్డ తినటానికి ఇంకొకళ్ళని అనుకరిస్తాం గానీ వాళ్ళ దగ్గరున్న మంచి నేర్చుకోవటానికి మన మనసు అంగీకరించదు. మాటలు చెప్పటానికి, పనులు ఎగ్గొట్టి కూర్చోవటానికి, సోమరితనానికి మనతో ఎవ్వరూ సాటిరారు. శ్రమైక జీవన సౌందర్యం * ఫారిన్ సెంటు (కథల సంపుటి) - ఫారిన్ సెంటు ◆