
G.S HASYA KATHALLU
by G.S.LAKSHMI
₹100
In stock · 6 available
PublisherG.S.LAKSHMI
LanguageTelugu
ముందుమాట లేకేం. కావాలనుకోవాలేగానీ కావలసినంత వుంది. ఏవిటది ? ఏవుందీ? అనుకుంటున్నారా? అదేనండీ ! హాస్యం ! బాధ హాస్యం ఎవరూ రాయడంలేదు అని పాపం చాలామంది పడిపోతూ వుంటారు. అవార్డులూ గట్రా ఇవ్వటానికి పనికిరాక పోయినా అలా సరదాగా చదువుకునేందుకు హాస్యం కావాలి అందరికీనూ. అందుకే పాపం ముళ్ళపూడిగారి దగ్గర నుండీ పొత్తూరి విజయలక్ష్మి (అంటే నేనే అన్నమాట) దాకా, పోన్లే ఎవరూ సభ పెట్టి సన్మానం చెయ్యకపోయిన, మెచ్చి మేకతోలు కప్పకపోయినా, పాఠకులు ఆదరిస్తున్నారు అదే పదివేలు. అని ఓపిగ్గా హాస్యం రాస్తూనే వున్నారు. జి.యస్. లక్ష్మి గారు కూడా పాపం అదే పని చేస్తున్నారు. ఆవిడ కధల్లో హాస్యం ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ ట్రాక్ గా విడిగా ఉండదు. కధలో కలిసిపోయే ఉంటుంది. కాబట్టి నవ్వు తెచ్చుకోనవసరం లేకుండా దానంతట అదే వచ్చేస్తుంది. కధల్లోని పాత్రలన్నీ మనకు చుట్టూ వున్నవే. కాబట్టి ఇలాంటి వాళ్లను మనమూ చూసాం అనిపిస్తుంది. ఉదాహరణకు తాపీగా వంటచేసే మరదలూ, మొబైల్ యుగంలో పెళ్ళిచేయించే పురోహితుల సమయ స్ఫూర్తి హాయిగా నవ్విస్తాయి. ఇలాంటి చెణుకులూ చమత్కారాలు చాలా వున్నాయి మరి. కాబట్టి అలవోకగా చదివేసుకోవచ్చు. ఆ మధ్య ఓ పెళ్లి శుభలేఖ చూసాను. చి„ వెంకట సత్య నాగ సూర్య శివ సాయి దుర్గా వర ప్రసాద శశాంక్కు చి|| సౌ॥ లాస్యను ఇచ్చి అని వుంది. రామాయణంలో పిడకలవేటలాగా ఇప్పుడు ఆ శుభలేఖ ప్రసక్తి ఎందుకు అనుకుంటున్నారా ? చెప్తా. ఈ పుస్తకంలో కధలు కొన్ని పే...ద్దవి. కొన్ని చాలా చిన్నవి. ఆఖరున వదినగారి కధలు వున్నాయి నిండుగా.