GAALI VANA by GANNAVARAPU NARASIMHA MURTHY Telugu book cover

GAALI VANA

by GANNAVARAPU NARASIMHA MURTHY

₹150
In stock · 5 available
PublisherMANTHA BHANUMATHI
LanguageTelugu
స్వేచ్ఛ ఆ రోజు ఆనంద్ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తాళం వేలాడుతూ కనిపించేసరికి అతనికి కోపం ముంచు కొచ్చింది. ఈ మధ్య సుమతి బాంక్ నుంచి ఆలస్యంగా వస్తుండ టంతో అతడు కూడా ఆలస్యంగానే వస్తున్నాడు. కానీ ఈ రోజు తన కొలీగ్ కూతురు పెళ్ళికి వెళ్లాలనుకోవడంతో ఇంటికి త్వరగా వచ్చాడు. సుమతికి ఫోన్చేసి ఈ రోజు పెళ్లికి వెళ్ళాలన్న విష యం గుర్తు చేస్తే తనకి చాలా పనుందనీ కుదరదనీ చెప్పడంతో అసహనానికి గురయ్యాడు. సుమతి ఎనిమిది గంటల వేళ ఆటోలో దిగింది. వస్తూనే ఫ్రెషప్ అయి వంట చేయడం మొదలు పెట్టింది. ఆనంద్ ముఖా వంగా ఉండటంతో ఆమె కూడా మౌనంగానే తన పనులు తాను చేసుకోసాగింది. కొద్దిసేపటి తరువాత కాఫీ కలిపి అతని కిచ్చింది. అతను ఆ గ్లాసు అందుకోకుండానే "నాకక్కరలేదు. ఇక రేపట్నుంచీ హెూటల్లో భోజనం చేసి వస్తే బెటరనిపిస్తోంది. నువ్వు ప్రతీరోజూ ఎనిమిది గంటలదాకా రాకపోతే ఎలా?” అన్నాడు కోపంగా. అతని మాటలకు సుమతికి కూడా కోపం వచ్చింది. "అంటే నేనే కావాలని ఆలస్యం చేస్తున్నానంటారా? నేనేమీ