GAALIBUDAGALU by PROF.P.N.MURTHY Telugu book cover

GAALIBUDAGALU

by PROF.P.N.MURTHY

₹140
In stock · 16 available
PublisherPROF.P.N.MURTHY
LanguageTelugu
గాలిబుడగలు ఆంధ్రప్రదేశ్ లో చిరకాలంగా విద్యాలయాలకూ, రాజకీయాలకూ పేరుగన్న పట్టణం గుంటూరు. ప్రతి ఏటా జూన్ నెల వచ్చేటప్పటికి విద్యార్థులతో కిటకిటలాడి పోతుంది. ఇళ్ళకు అద్దెలు హెచ్చిపోతాయి. ప్రతి యింట్లో కొత్తవాటాలు ఏర్పడతాయి. కాని ఈ జనాభా వత్తిడికి తగినట్లుగా భోజనానికి మంచి హోటళ్ళూ, వినోదానికి విశాలమైన సినిమా హాళ్ళూ వున్నాయి. రోజులో ఏ భాగంలో వెళ్ళినా హోటళ్ళన్నీ నిండే వుంటాయి. థియేటర్లలో మూడాటలకు ప్రేక్షకులు కరువులేకుండా వుంటారు. అన్ని హంగులూ వున్న ఆగొప్ప పట్టణంలో లేనిది పరిశుభ్రత, కనపబడనిది కంటికింపైన, సర్వజన మనోరంజకమైన పుపవనం. సూర్యభగవానుడి కటాక్షం వల్ల, ఆ వూళ్ళో ఒంటిమీద బట్ట నిలవకుండా చెమటా, తలమీద కేశాలు నిలవకుండా వేడీ ఈ రెండూ సమృద్ధిగా లభిస్తయ్. పగలంతా శ్రమచేసి వచ్చిన తరువాత కులాసాగా షికారు వెళదామన్న తలంపు కూడా రాకుండా, ఉన్న శక్తి అంతా ఆ పరమేశ్వరార్పణమే అవుతుంది. అయినా సాయంత్రం యింట్లో కూర్చునే సాహసం ఏ కొద్దిమందికో తప్ప వుండదు. 1947 జూలై మాసంలో మొదటి శుక్రవారం రవిశంకర్ ఆరోజు కాలేజీ నుండి నాలుగున్నరకే తిరిగివచ్చేశాడు. ఎండలో రెండుమైళ్ళు నడిచి వచ్చిన తరువాత అరగంట పడుకుంటేనేగాని ఆ శ్రమతీరలేదు. బయట ఎండ యింకా ప్రచండంగానే వుంది. అయిదుగంటలైనా అర్కదేవుడికి తిరోగమించాలన్న ఆసక్తే లేకపోవటం ఆశ్చర్యంగా వుంది. ఆ ప్రాంతంలో ఆగష్టుమాసంలో కూడా ఎండలు కాస్తాయి. ఇంక జూలై సంగతి వేరే వివరించవలసిన అవసరం ఏముంటుంది?