
GAAYAPADDA KAALIBAATALA NUNCHI
₹300
In stock · 15 available
PublisherPERSPECTIVES
LanguageTelugu
ISBN9789381172407
ఆత్మగౌరవం వం కోసం నాలుగు తరాల పెనుగులాట ఈ పుస్తకంలోని కథలన్నీ వివక్ష నుంచి, వెలి గాయాల నుంచి పుట్టుకొచ్చిన చ్చినవే! కుల సమాజంలో తాగే నీళ్ళకోసం, ఒంటినిండా గుడ్డకోసం, చెప్పులేసుకుని అందరిముందు నడవడం కోసం, చదువు కోసం, ప్రేమ కోసం మొ మొత్తంగా మనిషితనం కోసం నిత్యం యుద్ధం చేయాల్సిన మనుషుల కథలివి. వారి బతుకంతా అవమానాల పరంపరలు... చరిత్ర పొడుగునా నెత్తుర స్తేరంటిన పాదముద్రలు... సజీవ దహనాలు, వెలివేతలు, వురితీతలకు కూలిపోయినవారు వారు దాటిన వడగాడ్పులను చరిత్ర అంతగా నమోదు చేయలేదు. ప్రాచీన సాహిత్యంలో రాక్షసులు, అసురులు, అవర్థులు, పంచములుగా పిలు ఛండాలురుగా చరిత్రలో వక్రీకరణకు గురయినవారు. 1888లో పుట్టిన భాగ్యరెడ్డి భా వర్మ కథ 'వెట్టి మాదిగ' నుంచి 1977లో పుట్టిన కత్తి మహేష్ కథ 'యాదృచ్ఛిక -ఒక ప్రేమకథ' వరకు నాలుగు తరాల దళిత రచయితల కథలు యిం యిందులో లువబడి వున్నాయి. వీరిలో కథలు విస్తృతంగా రాసి కథకుడిగా పేరున్న బోయ జంగయ గయ్య నుంచి అరుదుగా కథలు రాసిన శివసాగర్ వరకు యిరవై ఐదుమంది రచయిత తలు ఉన్నారు. వీరెవరూ జీవించిలేరు. నాలుగు తరాల దళిత రచయితలు వారు కుల సమాజాన్ని చూసిన దృష్టి కోణంలో వుండే వైవిధ్యాన్ని యీ కథా సంకలనం నమోదు చేస్తుంది. అంతేకాదు వివిధ తరాల రచయితలు రాసిన కథలలో వుండే వస్తు రూపాల వైవిధ్యం కూడా యీ పుస్తకం ప్రతిఫలిస్తుంది.