
GABBAGEEMI
₹150
In stock · 75 available
PublisherSANTHIVANAM FOUNDATION
LanguageTelugu
Gabbageemi. Santhivanam Manchikanti ప్రజాస్వామిక సంస్కృతితో కూడిన ఒక ప్రాపంచిక దృక్పథానికి నిబద్ధుడై సాహిత్య సృజన చేస్తోన్న రచయిత మంచికంటి. శింగరాయకొండ, ఒంగోలు పల్లె పట్టులు మంచికంటి సాహిత్య, సామాజిక కార్య క్షేత్రాలు. మట్టిని తొలుచుకు వచ్చిన ఆ ప్రాంతపు మనుషులే అతని రచనలకు జీవం పోస్తారు. వారి నిత్య జీవిత సంఘర్షణే అతని సాహిత్యానికి ప్రధాన వనరు విచ్ఛిన్నమౌతోన్న గ్రామీణ వ్యవస్థ, తలకు మించిన మదుపులతో కునారిల్లుతోన్న వ్యవసాయం, అప్పుల పాలైన రైతుల ఆత్మహత్యలు, బతుకులు బొగ్గయి కొంపా గూడూ వొదులుకొని దగ్గర్లోని పట్టణానికో నగరానికి వలసపోయే రైతు కూలీల దుర్భర దారిద్య్రం-వీటన్నిటికీ మంచికంటి ప్రత్యక్ష సాక్షి. తాను విన్న, కన్న, స్వయంగా అనుభవించిన వాటి ద్వారా యేర్పరచుకొన్న ప్రాపంచిక దృక్పధం నుంచి ఆ కల్లోలాన్ని వొక సృజనాత్మక రచయితగానే గాక వొక సామాజిక శాస్త్రవేత్తగా కూడా మంచికంటి వ్యాఖ్యానిస్తాడు, విశ్లేషిస్తాడు. ఒంగోలు ప్రాంత నిర్దిష్టతలోంచి వచ్చినప్పటికీ అతని రచనల్ని ప్రపంచీకరణ నేపథ్యంలోనే చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల ప్రతిఫలనాలు, ప్రకంపనలు స్థానీయ జన జీవితాల్ని అస్తవ్యస్తం చేసిన వైనాన్ని మంచికంటి అద్భుతంగా పట్టుకొన్నాడు. కథల్లో కంటే అది నవల్లో విస్తృతమైన కాన్వాస్ మీద ఆవిష్కారమైంది. ఈ నవలలో మనుషుల జీవితాల్లోని సంక్లిష్టతనూ మృగ్యమౌతున్న మానవ సంబంధాలనూ కళ్ళకు కట్టినట్లు చూయించాడు మంచికంటి.