
GABBILAM - GUDLAGUBA - 70
₹70
In stock · 570 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గబ్బిలమూ - గుడ్ల గూబా ఒక కాలంలో- పక్షులకూ జంతువులకూ పెద్ద యుద్ధం జరిగింది. రామ చిలుక, పావురం, గోరువంక, రాబందులూ, గరుడ పక్షులూ గండ భేరుండాలు అన్నీ ఒక వేపు సింహాలూ, పులులూ, ఏనుగులూ, ఖడ్గ మృగాలు ఉడతలూ, కుందేళ్లూ, జింకలూ - ఇలాటి జంతువులు అన్నీ ఇంకో వేపు చేరాయి. పోరాటం ఘోరంగా సాగుతా ఉంది. పగలు అంతా యుద్ధం సాగేది. రాత్రి అయ్యాక మరునాటి యుద్ధం గురించి ఆలోచనలు చేసేవి. గబిలం, గుడ్లగూబ మంచి నేస్తాలు. నేస్తాలే కాని ఆలోచనలు ఎప్పుడూ వంకరే. అవి ఎటువేపూ చేర లేదు. గుడ్లగూబ పక్షి జాతికి చెందినది. గబ్బిలం ఇటు పక్షులు, అటు జంతువులు రెండిటికీ చెందింది. పక్షుల తరఫున గండ భేరుండం వచ్చింది కదా. జంతువులు వాటి ముందు నిలవలేనట్టు కనపడింది. "పక్షులదే పై చేయిగా ఉన్నట్టుంది. ఇక మనం కూడా యుద్ధంలో దిగాలి. లేకపోతే మర్యాద దక్కదు"- గబ్బిలం, గుడ్ల గూబతో అంది. గుడ్ల గూబ 'మనం ఎవరి వేపు చేరాలి' అంది సందేహంగా. "పక్షుల తరఫున చేరదాం. వాటిదే పై చేయిగా ఉంది" అంది గబ్బిలం. “నిజమే” అంది గుడ్లగూబ. గబ్బిలం, గుడ్ల గూబ పక్షుల దగ్గరకు వెళ్లాయి. “మనం మనం ఒకటి. అందరం పక్షులమే. యుద్ధంలో మేము మీ పక్కన పోరాడతాం" అంది గబ్బిలం. "వల్ల కాదు” అన్నాయి పక్షులు. “నీది పక్షి జాతి కాదు గుడ్ల గూబ పక్షి. దానిని చేర్చుకుంటాం” అన్నాయి అవి. "కాదు. నేనూ పక్షినే. కావాలంటే చూడండి నా రెక్కలు" అంది గబ్బిలం. "ఉన్నాయిలే రెక్కలు. అంత మాత్రనే పక్షివి కాదు... నీలో సగం జంతు లక్షణాలు కూడా ఉన్నాయి." పక్షులు అభ్యంతరం చెప్పాయి. 3