
GADHA-80
by K.SIVA REDDY
₹80
In stock · 4 available
PublisherK.SIVA REDDY
LanguageTelugu
గాథ అది జన్మిస్తుంది అకస్మాత్తుగా మందుపాతర పేలినట్టు విత్తయినా లేకుండా శతాబ్దాలుగా నిద్రిస్తున్న దుంపయినా లేకుండా అది మొలుస్తుంది, సెలవేస్తుంది వంటింట్లోనో, నట్టింట్లోనో నడిరోడ్డు మీదో, కూడుకుంటున్న కూడలిలోనో మూసిన యింట్లోనో వీధిలాంటి కొంపలోనో-ఎక్కడయినా అకస్మాత్తుగా నీకు చెప్పకుండా, నువ్వూహించకుండా sooooo. అది జన్మిస్తుంది దాని జన్మ ఒక విస్పోటనం ఉసుళ్ల పుట్ట పగిలినట్టు పగలటం; అది ముల్లులా వుంటుంది. మొక్కలా వుంటుంది. పువ్వులా వుంటుంది పగిలిన కుండలా వుంటుంది బాగా కాలిన కుండలానూ వుంటుంది.