
GAJAL GULDASTA - TELUGU GAJAL SANKALANAM
₹200
In stock · 1 available
PublisherGAJAL GULDASTA
LanguageTelugu
జ్యోట్గా ఖజానాకి చేరిన మరో మణిహారం గజల్ గుల్దస్తా 2015 నవంబరులో ప్రారంభించబడిన జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ (జ్యోట్గా) తెలుగు గజల్ సాహిత్య ప్రచారానికి పూనుకోవడానికి ముఖ్యమయిన కారణం గజల్ ప్రక్రియలో ఉండే అనేక ప్రత్యేకతలు. బరువైన భావాలను సరళమైన భాష ద్వారా సున్నితంగా అభివ్యక్తీకరించగలిగే ఆస్కారమున్న గొప్ప సాహిత్య ప్రక్రియ గజల్. విషయాన్ని కొంత గుంభనంగా ఉంచుతూ కొంత చమత్కారపూరితంగా వ్యక్తీకరించే ఒక ప్రత్యేకమైన శైలి గజలుది. ఇది పాఠకులు లేదా శ్రోతలలో అద్భుతమైన రసానుభూతిని కలిగిస్తుంది. అందుచేతనే ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందుతూ ఉంది. తెలుగులో గజల్ కచేరీలు చేసిన మొట్టమొదటి గాయనిగా గుర్తింపబడి నిర్విరామంగా కచేరీలు చేసుకుంటూ గజల్ గానంలోని హాయిని అనుభవిస్తూ వస్తున్న నాకు గజల్ సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆ క్రమంలో ప్రముఖ గజల్ కవులు సినారె, రెంటాల, పెన్నా వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. గజల్ ఛందస్సు, అభివ్యక్తి మొదలయిన విషయాలపై నా సందేహాలను వారి ద్వారా నివృత్తి చేసుకోగలిగాను. గజల్ ని కొంతవరకూ అర్ధం చేసుకోగలిగాను. అంతవరకూ ఆగితే సరిపోయేదేమో, మరో కొత్త కోరిక పుట్టుకొచ్చింది గజల్ రచన కూడా చెయ్యాలని. చిన్నగా రాస్తూ పెన్నా, రెంటాల గార్ల సూచనలతో సరిదిద్దుకుంటూ వచ్చాను. నా కచేరీలకు కావలసిన అంశాలు గజలుగా దొరకనపుడు 'ఓ ప్రయత్నం చేస్తే తప్పేంటీ 'అనిపించింది. అలా నా అవసరమే నా చేత గజల్ రాయించింది. అయితే, రాయాలనే ఆసక్తి ఉంటే సరిపోతుందా, సామర్థ్యం ఉండొద్దూ? కచేరీలో వందలమందికి చేరవేయబోయే విషయం శక్తిమంతంగా ఉండొద్దూ? అయినా మొండిగా పెద్దవాళ్ళ గజళ్ళ మధ్య అక్కడక్కడా నావీ ఇరికించి కచేరీలు చేయడం మొదలు పెట్టాను.