
GAJUNADI
by SHILALOLITHA
₹80
In stock · 12 available
PublisherSHILALOLITHA
LanguageTelugu
విహంగమూ తానే, విహాయాసమూ తానే... హరివిల్లును చూడాలంటే వానికి సిద్ధం కావాలని ఎక్కడో చదివిన గుర్తు. నాకు తెలిసినంత వరకు శిలాలోలిత ఒక నిరంతర ధ్యానమగ్న వర్షధార. నాకు తెలిసినంత వరకు లక్ష్మిగారు (శిలాలోలిత) ఒక ఆప్తవాక్యం. ప్రవాహంలో దాగిన స్థిరత్వమెలా ఉంటుందో ఆమెను చూశాకే అర్థమైంది. స్త్రీల సాహిత్యం క్రమపరిణామ దశలో అంచెలంచెలుగా దాటుకుంటూ సమ్యక్ దృష్టితో, సమకాలీన పరిణతి దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వాస్తవాన్ని శిలాలోలిత వెలువరించిన ఈ తాజా కవితా సంపుటి స్పష్టం చేస్తోంది. స్త్రీల సొంత ముఖాలు, స్వరాలు, శరీరాలపై అలుపెరుగని దాడి చేస్తున్న సమాజం ఇప్పటికీ 'సౌందర్యాత్మక' ప్రతీకల వెంటే పరుగులు తీస్తోంది. హింస, అణచివేతల రూపంలో మార్పు వచ్చిందేమోకానీ, సారం మాత్రం ఇసుమంతైనా మారలేదు. స్త్రీగా తన అస్తిత్వాన్ని చాటుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా 'స్త్రీవాది' తన తరువాతి తరానికి 'ఏమైనా చేయగలను' అన్న నినాదాన్ని వారసత్వంగా ఇచ్చింది. ఇవాల్టి ఆడపిల్లలు ఉద్యోగాల వేటలోకి, ఆర్థిక ప్రణాళికల లోతుల్లోకి, ధనస్వామ్యపు సమాజపు డిమాండ్లలోయల్లోకి తమను తాము విసిరేసు కోవలసిన అవసరంలో పడ్డారు. శాంతికాముకులుగా, కడుపునింపే చేతులుగా, పోపుడబ్బాల పొదుపులుగా, పావలా వడ్డీ మదుపులుగా ఆడపిల్లలు తలమునకలుగా ఉన్నారు.