
GALIB KAVITHA KOUMUDI
by RAMACHANDAR
₹120
In stock · 41 available
PublisherRAMACHANDAR
LanguageTelugu
ముందుమాట మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ (1797-1869) గురించి, భారత ఉపఖండంలోని సాహితీ గంధం అంటిన అదృష్టవంతుల్లో, బహుశా తెలియని వారుండరు. ముఖ్యంగా హైదరాబాదులో పుట్టిపెరిగి చదువుకున్న వారు ఎవరైనా, వాళ్ళ మాతృభాష ఏదైనాసరే వారికి సాహిత్యంలో ప్రవేశం ఉన్నా లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గాలిబ్ గురించి తప్పకుండ అప్రయత్నంగానైనా వినే ఉంటారు. ఏదో ఒక కవిత గాలిబ్ దో. గాలిబ్ పేరున చెప్పిందో వినే ఉంటారు. అర్ధం అయినా కాకపోయినా 'వాహ్' అని స్పందిచే ఉంటారు. 'కా విద్యా కవితాం వినా?' అనే నానుడి ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. ఇది అతిశయోక్తి ఏ మాత్రం కాదు. హైదరాబాద్ సంస్కృతి చాలా విలక్షణమైనది. ఇక్కడివారు ఇంట్లో మాట్లాడే భాష ఏదైనాకావచ్చు వాళ్ళు ఇంటిబయట వాడుకునే 'మాట' భిన్నంగా ఉంటుంది. ఉర్దూతో ఉన్న అనుబంధం మూలాన ఇక్కడి భాష చాలా సంపన్న మైనదనే చెప్పాలి. హైదరాబాదీలది (పూర్వపు హైదరాబాద్ దేశం) సహజంగానే కవితాత్మక స్వభావం, షా'ఎరానా మిజాజ్. గంగా-జమ్నీ తహజీబ్ ఉన్న నగరాల్లో పుట్టిపెరిగి అలాంటి విద్యా సంస్థల్లో చదువుకున్న నాలాంటి వారు ఈ విషయంలో అదృష్టవంతులు. నేను ట్రూప్ బజార్, ఉర్దూ గల్లీ, హైదరాబాద్ లో పుట్టి, చాదర్ ఘాట్ హైస్కూల్ (అబిడ్స్)లో చదువుకున్నాను. గంగా-జమ్నీ తహజీబ్ అంటే హిందూ-ముస్లింలు కలసిమెలసి పరస్పర గౌరవ సహకారాలతో సాగించే సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని వర్ణించే శిష్టోక్తి. ఉర్దూ ద్వారా ఎన్నో తుర్కీ, ఫార్సీ, అరబ్బీ పదాలు తెలుగులోకి చేరిపోయాయి. సంస్కృతం తర్వాత ఉర్దూ పదాలే తెలుగులో గుర్తు పట్టలేనంతగా మిలితమైపోయాయి. ఉర్దూ క్రియారూపాలు తెలిగించబడి తెలంగాణ్యుల భాషలో ఏ రకంగా మమేకం పొందాయో పరిశోధకులు ఇదివరకే తెలిపారు. ఉదాహరణకు: గుసాయిస్తున్నాడు. (దూరుతున్నాడు), సతాయిస్తున్నాడు (వేధిస్తున్నాడు), అక్టాయిస్తున్నాడు. (విర్రవీగుతున్నాడు), రొకాయిస్తున్నాడు (అడ్డువేస్తున్నాడు), ఇవన్నీ తద్భవాలయ్యాయి.