
GAMANAM YEVAIPU
₹70
In stock · 25 available
PublisherKUMARI BOYINI ROHINI
LanguageTelugu
1. అంతా మిథ్య కురిసే ప్రతి చినుకు గమనం ఏవైపు అలలై ఎగిసిపడే ఆ సంద్రము వైపు జనించు ప్రతి శిశువు గమనం ఏ వైపు తన రాక కోసం ఎదురుచూసే మృత్యుదేవత వైపు మరి ఈ జనన మరణాల మధ్య ఉన్న మిథ్య కోసం కోప, ద్వేష, ఈర్ష్యలు ఎందుకు, ధనిక పేద వర్గాలు ఎందుకు ఆ పరమాత్మ ప్రతీ జీవిని ఒకే మనస్తత్వంతో జనింపజేయనందుకు ఈ తప్పిదం పరమాత్మదా జనించిన జీవిదా మరెవరిది? హై ఉం పూర్వ జన్మలలో చేసుకున్న పాప కర్మలదే! 2. ఆభరణం గరళ కంఠునికి మెడలో మెరిసే సర్పమే ఆభరణం గణేశునికి గరకపోచలతో వేసే మాలే ఆభరణం గలం ఎత్తి స్వరార్చన చేసే గాయని, గాయకులకు స్వరపేటికయే ఆభరణం, పేదరికాన్ని లెక్కచేయక, గమ్యాన్ని చేరుకున్న లక్ష్య సాధకులకు గెలిచిన గెలుపే ఆభరణం